|
are the trend-setters |
|
|
|
|
|
|
Articles: Drama | తొలకరి పలకరింపులు - Site Administrator
| |
సూరన్న : బోరు బావి నీకున్నది తీరు బడిగ వున్నావు నువ్వు
పాపన్న : బావి వున్నాదేల బావ - కరంటిస్తండేటి?
విత్తనాలు కొనడానికెళితె - పురుగు మందులమ్ముతుండు
పురుగుమందులడిగితె - విత్తనాలు ఇస్తడేటో
పురుగుమందు తాగినోడికి - ఇత్తనాలు ఏలబావ?
నన్ను నువ్వు పలకరించు - నిన్ను నేను పలకరిస్త
సంవర్తి పిల్లని సింగారించింది గావాల... ఇంతవేలయ్యింది... గబగబా ఇంటివేపు నడుచుకొస్తున్న సూరప్పను పలకరించాడు.
పాపన్న : వర్షం పడిపోతాదేటో - తడిసీపోతావని
గుబ్బగొడుగు తీసి - గబగబ ఎదురొస్తన్నానప్పా
సూరప్ప: వానలేదు గీన లేదు - గోర్జుదిక్కు సూడరన్న
ఎడ్లబండిమీద - పెద్ద కూతురొస్తున్నది
పురిటి సమయమొచ్చింది - పల్లకుంటదేటి కాలం
పలకరించురోరన్నా - పిల్లా పాప రేపీపాటికి
సూరన్న : శ్రావణమొచ్చేస్తున్నది - శుభమూర్తం చూడాలా
చిన్న కూతురింటికెళ్ళి - సీమంతం చెయ్యాల
సూరప్ప : ఊరందర కూరేపతి - ముసలమ్మకు మొగుడేపతి
మూర్తాల్ తీర్తాల్ జూసి - మొలకలేల పలకరిస్తయి
చేసిన కాడికి సెయ్యాల పనులు - చూసినకాడికి చూడాల చూపులు
సూరన్న : ఓసోసి వూరుకోయె - ఆపాటి తెల్దుమాకు
అందరూ ఎడ్లబండి ఆగిం దగ్గరకెళ్ళి, పేరు పేరునా మండిలోనున్న అల్లుడ్ని, ఈరకాడిని, ఈరకత్తినీ, పెద్దమ్మినీ పలకరించి - జాగర్త... జాగర్త అంటూ నిండు చూలాల్ని (పెద్దమ్మిని) కిందికి దించినారు. సూరప్ప వచ్చి పిల్లకు దిష్టి తీసింది... ఇంట్లోకి తోడ్చుకొని తీసుకెళ్ళారు.
పాపన్న : పలకరింపుకొచ్చినాయి - తొలకరి చినుకులు
తొలకరి తెలుగులోన - పలకరింపుకొచ్చినాయి
నిన్నటికీ రేపటికీ - నీ పని బాగుంది బావ
కలవలోలు మనవలు - పలకరిస్తారు వచ్చి
సాయపడతారు నీకు - సల్లగెల్తాది బతుకు
ఏటి పంట్టుకుందీడికి. తెల్లారనివ్వకండ... ఇకటాలడ్డానికొచ్చినాడేటీడు.
వీడివి మాటలో పోటులో గాని... చంపేస్తున్నాడు. ఈడిసెల్లిలు సూరప్ప (నా ఆడది) ఈడిలాటిదాయే... ఈటిపోటు మాటలకి... అని మనసులోన అనుకుంటూ సూరన్న-
| Be first to comment on this Article!
| |
|
|
|
(C) 2000-2024 TeluguPeople.com, All Rights Reserved.
|
|
|
|
|