'ఇక్కడ రోడ్ లు ఘోరం గా వున్నాయి. .గవర్నమెంట్ అస్సలు పట్టించుకోవడం లేదు. కొత్త సీఎం రోడ్లు వేయించుతా అంటున్నాడు. కానీ ఈ పొలిటియన్ లను నమ్మలేం భాయి. ఈ రోజు ఒక మాట చెప్తే రేపొక మాట చెప్తారు. ఈ రోజు ఒక పార్టీ లో వుంటే రేపు వేరే పార్టీ కి జంప్ అయితారు.'
'అవునూ ...వెంకట్ మొన్న వేరే కంపెనీ లో ఆఫర్ వచ్చిందని అన్నావు. ఏం చేస్తున్నావ్.. జాబు మారతావా...?' వెంకట్ మాటలవల్ల అతనికి వచ్చిన ఆఫర్ గుర్తుకు వచ్చింది.
'చూడాలే మన కంపెనీ వాడు యూఎస్ పంపించుతా అంటుండు . పంపించక పోతే అప్పుడు రిజైన్ చేస్తా.. .. అన్నట్టూ నువ్వు కూడా సాఫ్ట్వేర్ నుండి వేరే ఫీల్డ్ కి మారుతా అంటున్నావు కదా, దాని సంగతేమయింది ?' నన్నడిగాడు వెంకట్.
'నాకు మారాలనే ఉంది. కాని కుదరక పోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ జాబు పులి మీద స్వారీ లాంటిది. జాబు లో జాయిన్ అయిన కొత్తల్లో చాలా నే డబ్బు కనిపిస్తుంది . నెమ్మది గా ఖర్చులు పెరుగుతాయి. కారు లోను, హౌస్ లోను ఈఎమ్మై కట్టాలి. వాటి కోసం జాబు చేస్తూనే ఉండాలి......నువ్వు ఇప్పుడు యూఎస్ వెళ్తా అంటున్నావ్.. మీ వూరు వెళ్లి వ్యవసాయం చేసే ప్లాన్ మానుకోన్నట్లేనా? ..' అన్నాను వెంకట్ తో.
'అరేయ్....అదో పెద్ద టాపిక్. ఇప్పుడు టైం లేదు. మల్ల సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు మాట్లాడుదాం ....'
' ఈ లోగా మా కాబ్ ఎలక్ట్రానిక్స్ సిటీ లోని మా ఆఫీసు ముందు ఆగింది. వెంకట్ వార్ దిగి గేటు దగ్గరికి వెళ్లి కార్డు స్వయిప్ చేశాడు . తర్వాత నేనూ స్వయిప్ చేశాను . నా తరవాత చాలా మంది స్వయిప్ చేస్తున్నారు....'కిక్ కీక్......కిక్....కీక్ ' స్వయిప్ మెషిన్ తన పని తాను చేసుకు పోతోంది. నేను నా సుబే కి వెళ్లి సీట్ లో కూర్చుని సిస్టం ఆన్ చేశాను.