Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 3 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
ఒక్క వెంట్రుక రాణి అనగనగా ఒకరాజుకి ఇద్దరు భార్యలున్నారు. పెద్ద భార్యకి రెండు వెంట్రుకలు ఉన్నాయి. ఆవిడ చాలా గయ్యాలి, ఎవరితోనూ సరిగ్గా నడచుకోదు. రాజుగారి చిన్న భార్యకి ఒక్కటే వెంట్రుక ఉంది. ఈవిడ చాలా నెమ్మది గుణం కలది అందరితో స్నేహంగా దయగా ఉండేది. పెద్ద భార్యకి తనకి రెండు వెంట్రుకలున్నాయని అందుకని ఒకటే వెంట్రుక ఉన్న చిన్న రాణీ కంటే తనే అందంగా ఉన్నానని అనుకునేది. ఓ రోజు రాజుతో ఒకే వెంట్రుక ఉన్న రాణి అసహ్యంగా ఉంది ఆమెని ఇంట్లోంచి వెళ్ళగొట్టేయమని చెప్పింది. దానితో రాజు చిన్న రాణీని అడవికి పంపించేసాడు. చిన్న రాణి అడవిలో అలా వెళుతూ ఉంటే దారిలో ఆమెకి ఆవులు కనిపించాయి మాకు కాస్త కుడితి కలిపి పెట్టి వెళ్ళవా. అని అడిగాయి. ఆమె సరేనని ఎంతో దయతో వాటికి కుడితి కలిపి పెట్టి తన దారిన తను వెళ్ళసాగింది. అలా కొంత దూరం అలా వెళ్ళాక ఆమెకి ఓచోట దారికి రెండువైపులా గులాబీ తోట కనిపించింది. ఆ గులాబీ మొక్కలు చిన్న రాణిని చూడగానే ఇక్కడ ఉన్న బావినుండి నీళ్ళు తోడి మాకు పోయావా. అని అడిగాయి. ఆమె వాటికి కావలసినన్ని నీళ్ళు తోడి పోసింది. ఇంకాస్త ముందుకెళ్ళగానే ఆ దారిలో ఎన్నో చీమలు వెళుతూ ఉన్నాయి అవి ఆమెతో దయచేసి మమ్మల్ని తొక్కకుండా వెళ్ళు. అని అన్నాయి. ఆమె వాటిని తొక్కకుండా జాగ్రత్తగా నడవసాగింది. కొద్దిదూరం నడిచాక ఆమెకి ఒకచోట పెదరాసి పెద్దమ్మ ఇల్లు కనిపించింది. అక్కడికి వెళ్ళగానే పెదరాసి పెద్దమ్మ చిన్నరాణీని పిలిచి నా ఇంటిని అలికి, అలంకరించి, నాకు కాస్త వంట చేసి పెడతావా? నాకు ఈరోజు అస్సలు ఓపిక లేకుండా పోయింది. అంది. దానికి చిన్న రాణీ అయ్యో పాపం ముసలమ్మ అన్ని పనులు చేసుకోలేదు కదా అనుకుకుని పెదరాసి పెద్దమ్మ ఇల్లు అలికి ముగ్గులేసి, వంటచేసింది. ఎందుకిలా అడవిలోకి వచ్చావు ? అని చిన్న రాణిని అడిగింది పెద్దమ్మ. తనకు ఒకటే వెంట్రుక ఉందని పెద్ద రాణీ రాజుతో చెప్పి వెళ్ళగొట్టించేసింది అంటూ జరిగింది చెప్పింది ఆమె. నీకు చాలా పొడవుగా వత్తుగా జుట్టు రావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి, కనిపించే ఆ నది వద్దకెళ్ళి ఈ కొబ్బరి కాయ కొట్టి నమస్కరించి నదిలో మూడు సార్లు మునిగి బయటకు వచ్చేసేయి. అని చెప్పింది పెదరాసి పెద్దమ్మ పెద్దమ్మ చెప్పినట్టుగానే మూడుసార్లు నదిలో మునిగి లేచేసరికి చిన్న రాణికి బారెడు జుట్టు వచ్చేసింది. ఆమె సంతోషంతో ఇంటికెళదామని అనుకుంది కానీ ఇంటికి ఎలా వెళ్ళాలో దారి తెలియలేదు. అప్పుడు అక్కడే ఉన్న చీమలన్నీ కలిసి మీ ఇంటికి దారి మేము చూపిస్తాము అంటూ బారులుగా ముందు నడుస్తూ దారి చూప సాగాయి. అలా వెళ్తుండగా గులాబీతోటలోని పూలన్నీ ఓ రాణీ నువ్వు నీళ్ళు తోడిపోసినందునే మా తోటంతా ఇలా పువ్వులతో నిండిపోయింది, ఇలా వచ్చి నీకు కావలసినన్ని పువ్వులు తీసుకుని వెళ్ళు. అన్నాయి. ఆమె కావలసినన్ని పూలు తలలో పెట్టుకుని అందంగా ముస్తాబై వెళ్ళసాగింది. అలా కొద్ది దూరం వెళ్ళాక మొదట ఆమె కుడితి పెట్టిన ఆవులు ఆమెని చూసాయి. చిన్న రాణీ నువ్వు ఎంతో మంచిదానివి మేమూ మీ ఇంటికి వచ్చేస్తాం రోజూ పాలు ఇస్తాం, నువ్విలా నడుస్తూ ఎందుకువెళ్ళడం అదిగో ఒక బండి ఉంది దానికి మమ్మల్ని కట్టి బండిపై హాయిగా వెళ్ళు. అన్నాయి. ఎంచక్కా బండిలో కూర్చుని చీమలు దారిచూపిస్తుండగా ఇంటికి వచ్చేసింది చిన్నరాణీ. అప్పుడు ఆమెని చూసిన రాజు ఎంతో సంతోషంతో ఇంట్లోకి పిలిచి, రెండే వెంట్రుకలు ఉన్న పెద్దరాణీ ని ఇంట్లోంచి వెళ్ళగొట్టేసాడు. పెద్దరాణీని రాజు అడవికి పంపేసాడు అక్కడ రాణీ కి కొన్ని ఆవులు కనిపించాయి అవికూడా కుడితి కోసం పెద్ద రాణిని అడిగాయి. పెద్ద రాణి వాటిని పట్టించుకోకుండా తనదారిన తాను వెళ్ళసాగింది. గులాబీ తోట లోంచి వెళుతోంటే అవి చిన్న రాణిని అడిగినట్టే పెద్ద రాణీని కూడా నీళ్ళు తోడి పోయమని అడిగాయి. పెద్దరాణి ఇక నాకేం పనిలేదా మీకు నీళ్ళు పోస్తూ ఉండాలా. అంటూ కోపంతో తన దారికి అడ్డంగా ఉన్న కొమ్మలని విరిచేస్తూ వెళ్ళింది. కొద్దిదూరం వెళ్ళాక ఆమెకి చీమలు కనిపించాయి దయచేసి మమ్మల్ని తొక్కకుండా వెళ్ళు. అన్నాయి. పిచ్చి చీమలు మీవల్ల ఏం ఉపయోగం అంటూ వాటిని తొక్కేస్తూ కాళ్ళతో నలిపేస్తూ నడిచింది పెద్దరాణీ. కాసేపటికి ఆమె పెదరాసి పెద్దమ్మ ఇల్లు చేరుకుంది. నా ఇల్లు అలికి అలంకరించి, నాకు వంటచేసి పెట్టు. అంది పెద్దమ్మ. హు నేను రాణీని నేను అలాంటి పనులు చేయను. అంటూ విసుక్కుంది పెద్దరాణి. సరే ఈ అడవిలోకి ఎందుకొచ్చావు? అంటూ అడిగింది పెద్దమ్మ. ఎక్కువ వెంట్రుకలు ఉన్నవాళ్ళే అందమైన వాళ్ళని నేను రాజుతో చెప్పాను అందువల్ల ఇప్పుడు చిన్నరాణికి నాకంటే ఎక్కువజుట్టు వచ్చేసింది అందుకే నన్ను వెళ్ళగొట్టేసాడు. అని జరిగిందంతా చెప్పింది పెద్దరాణీ. కనిపించే ఆ నది దగ్గరకు వెళ్ళి ఈ కొబ్బరికాయ కొట్టి నమస్కరించి, నదిలో మూడుసార్లు మునగి లేస్తే నీకుకూడా చిన్న రాణి జుట్టంత జుట్టు వస్తుంది. అంటూ చెప్పి కొబ్బరికాయ ఇచ్చింది పదరాసి పెద్దమ్మ. నది దగ్గరికెళ్ళి కొబ్బరికాయ కొట్టి నదిలో మూడు సార్లు మునిగింది పెద్దరాణీ. ఆమెకీ చిన్న రాణి కున్నంత జుట్టు వచ్చేసింది. చిన్న రాణి కున్నంతే ఉంటే ఇంక నా గొప్ప ఏముంది! రాజుతో చెప్పి మళ్ళీ ఆమెని వెళ్ళగొట్టించేసేయాలంటే ఆమెకంటే పెద్దజుట్టు నాకు ఉండాలి అనుకుంది పెద్దరాణీ. వెంటనే ఇంకో మూడు మునకలు వేసింది. అంతే ఉన్న జుట్టంతా ఊడిపోయి బోడిగుండై పోయింది. అయ్యో నాకున్న రెండువెంట్రుకలూ పోయాయే. అని ఏడ్చుకుంటూ వెళ్ళింది పెద్దరాణీ. అడవిలో దారి తప్పిపోయింది చీమలని అడిగినా అవిచెప్పలేదు పైగా ఆమెని బాగా కుట్టేసాయి. గులాబీ తోటలోకి రాగానే ఎండిపోయిన గులాబీ కొమ్మలన్నీ ఆమెని ముళ్ళతో బాగా కొట్టాయి. అంతలోకి అక్కడికి వచ్చిన ఆవులు ఆమెని తమ కొమ్ములతో పొడుస్తూ అడవిలోకి తరిమేసాయి

Posted by: Mr. Siri Siri At: 27, Dec 2010 6:16:37 PM IST
ఏడు చేపలు కథ అనగా అనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకి ఏడుమంది కొడుకులు ఉన్నారు. ఓరోజు వాళ్ళు వేటకి వెళ్ళి ఏడు చేపలు తెచ్చారు. వాటిని ఎండలో పెట్టారు. అందరి చేపలూ ఎండాయి కానీ చివరి అబ్బాయి చేప ఎండలేదు. అప్పుడు ఆ చిన్న అబ్బాయి చేపని ఇలా అడిగాడు. చేపా చేపా ఎందుకు ఎండలేదు? ఎండ సరిగా తగలకుండా గడ్డిమోపు అడ్డంగా ఉంది. అంది చేప గడ్డి మోపు గడ్డి మోపు ఎందుకు అడ్డంగా ఉన్నావు? అని గడ్డిమోపుని అడిగాడు అబ్బాయి. నన్ను ఆవు మేయలేదు అందుకే అలా అడ్డంగా ఉన్నా. అంది గడ్డిమోపు. ఆవూ ఆవూ ఎందుకు గడ్డి మేయలేదు? అడిగాడు అబ్బాయి. పిల్లవాడు మేపలేదు. అంటూ చెప్పింది ఆవు. పిల్లవాడా.. పిల్లవాడా ఎందుకు ఆవుని మేపలేదు. అని అడిగాడు అబ్బాయి. అమ్మ అన్నం పెట్టలేదు, అందుకే నేను ఆవుని మేపడానికి వెళ్ళలేకపోయాను. అంటూ బదులిచ్చాడు గొల్లపిల్లవాడు. అమ్మా అమ్మా ఎందుకు అన్నం పెట్టలేదు? అమ్మనడిగాడు అబ్బాయి. చిన్ని పాప ఏడుస్తోంది. అందుకే వండలేదంది అమ్మ. చిన్ని పాప చిన్ని పాప ఎందుకేడుస్తున్నావు? అన్నాడు అబ్బాయి. నన్ను చీమ కుట్టింది. అంది చిన్ని పాప చీమా చీమా ఎందుకు కుట్టావు? చీమని ప్రశ్నించాడు అబ్బాయి. మరి నా బంగారు పుట్టలో వేలు పెడితే.. కూట్టనా..కుట్టనా కుట్టానా. అంటూ కుట్టేసింది చీమ.

Posted by: Mr. Siri Siri At: 27, Dec 2010 6:12:34 PM IST
గజ్జెలెడ్ల బండిమీద! గంగవరం బోతున్నా రావే రంగమ్మో జాతరన్న బోదాము..//రావే// కంచిపట్టు చీరలేదు ! అంచులున్న రవికెలేదు మంచి మల్లెపూలమీద మనసేమొ గుంజవట్టె రానుపోర జాతరా గంగవరం నీవెంట..//రాను// మంచి చీరెలిపిస్తా! మల్లెపూలు దెప్పిస్తా అంచులున్న రైకమీద అద్దాలేపిస్త పిల్లా//రావే// చేతులొక పైసలేదు! చేతికి గాజూలు లేవు చెప్పుకోవాలంటే సిగ్గేలో రావాయే..//రాను// చేతిగాజులిప్పిస్తా! చేతి ఖర్చు పైసలిస్తా చెకుముఖిరవ్వ సిగ్గెందుకెపిల్లా..//రావే// కడియాలు లేకపాయె కంకణాలు లేకపాయె అడిగేటందుకేమో చాల బిడియపడి సస్తున్నా..//రాను// కడియాలు ఇప్పిస్తా! కంకణాలు దెప్పిస్తా అడుగులెయ్యి ముద్దులొలక అందాల రామచిలుక..//రావే// బోడిమెడ బెట్టుకొని! యాడకొత్తు నీయెంటా అడ్డిగొకటి అడగాలటని హడలిపోయి సస్తున్నా..//రాను// మెడకు మంచి హారమేస్త! మేలైన సొమ్ములిస్త తడవు సేయకుండదావె తరణివెల్లిపోదాము...//రావే// గజ్జెలెడ్ల బండిమీద! గంగవరం నేనొస్తా ఆపుర అంజయ్యో బండి మీద నేనొస్తా//ఆపుర// రావే రంగమ్మో జాతరన్న పోదాము ఆపుర అంజయ్యో బండిమీద నేనొస్తా //ఆపుర//

Posted by: Mr. Siri Siri At: 27, Dec 2010 11:52:23 AM IST
నిలువవే వాలు కనులదానా వయ్యారి హంస నడకదానా నీ నడకలో హోయలున్నవే చానా నువ్వు కులుకుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు ఓ లలనా అది నీకే తెలుసు నిలువవే.... ఎవరని ఎంచుకోనినావో పరుడని భ్రాన్తిపదినావో ఎవరని ఎంచుకోనినావో.. భ్రాంతి పదినావో సిగ్గుపడి తోలిగేవో విరహాగ్నిలో నను తోసి పోయేవో నువు కులుకుతూ... ఒకసారి నను చూడరాదా చెంతచేరా సమయమిది కాదా ఒకసారి నను చూడరాదా సమయమిది కాదా వగలాడి నే నీవాడనే కాదా నువు కులుకుతూ మగాడంటే మొజులేనిదానా మనసుంటే నీకు నేను లేనా మగాడంటే మోజు లేనిదానా .. నీకు నేను లేనా కోపమా నా పైనా నీ నోటి మాటకే నోచుకోలేనా నిలువవే...

Posted by: Mr. Siri Siri At: 27, Dec 2010 11:51:56 AM IST
ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ..ఆ..లా..లా..లా.. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ చలమయ్య వస్తాను ఆపైన చూస్తాను చలమయ్య వస్తాను ఆపైన చూస్తాను తొందర పడితె.. లాభం లేదయా..అ..ఆ..ఆ.. నీ జారుపైట ఊరిస్తువుందీ..మ్మ్.. నీకొంటే చూపు కొరికేస్తువుందీ.. నీ జారుపైట..ఊరిస్తువుందీ..అబ్బా.. నీకొంటే చూపు కొరికేస్తువుందీ.. కన్ను కన్ను ఎపుడో కలిసింది..హా..హా.. అయ్యో..ఏందయ్య గోలా సిగ్గేమి లేదా..నాకెందుకు? ఊరోళ్ళు ఇంటే ఎగతాళి కాదా.. ఏందయ్య గోలా..ఛీ..ఛీ.. సిగ్గేమిలేదా..పోదుబడాయ్.. ఊరోళ్ళు ఇంటే ఎగతాళి కాదా.. నిన్ను నన్ను చూస్తే నా మరదా.. ఆ..ఓ..ఆ..ఆ..మ్మ్.. ముత్యలు..ఆ..వస్తావా..మ్మ్.. అడిగింది..అబ్బో..ఇస్తావా.. ఊర్వశిలా ఇటురావే వయ్యారీ.. పర్మినెంటుగాను..ఆ.. నిన్ను చేసుకొంటాను..అబ్బో ఉన్నదంత ఇచ్చేసి..అయ్యో.. నిన్ను చూసుకోంటాను ఇంట బయట పట్టుకునుంటాను.. ను..హు..హు..అహా..అహా..ఎ..హె..హె.. ఏరుదాటిపోయాక తెప్ప తగలవేస్తేనూ.. ..అమ్మామ్మా.. ఊరంత తెలిసాక వదిలిపెట్టిపోతేనూ.. బండకేసి నిను బాదేస్తానయ్యో.. ఓ..హో..ఓ..అహా..హా.. రేవులోన నిను ముంచేస్తానయ్యో ..హో..అహా...మ్మ్..ఒహో.. ముత్యాలూ..ఆ.. వస్తావా..మ్మ్.. అడిగిందీ..అయ్యో.. ఇస్తావా.. ఊర్వశిలాఇటురావే వయ్యారీ..ఇ..హీ..ఈ..ఓ.. చలమయ్యా ..ఆ.. వస్తానూ..అబ్బో.. ఆపైనా..చూస్తాను..అయ్యో.. తొందరపడితే లాభన్ లేదయ్యా..డ..డా..డా..లా.. ముత్యాలు..ఆ.. వస్తావా..మ్మ్.. అడిగిందీ..ఆ.. ఇస్తావా..??

Posted by: Mr. Siri Siri At: 13, Dec 2010 6:42:30 PM IST
http://www.youtube.com/watch?v=gzx4Qe79SGk

Posted by: Mr. Siri Siri At: 15, Nov 2010 5:07:39 PM IST
జింగిలాలో ఏం గింగిరాలో బొంగరాలో ఈ భాంగ్రాలో లెఫ్టు రైటు లేదులో పడుచు బాటలో ఎర్ర లైటు వద్దురో కుర్ర జోరులో చిన్నారి ఈ చకోరి చూపింది చిలిపి దారి ఓరోరి బ్రహ్మచారి.. వదిలేస్తే వెరీ సారీ పారాహుషారు పాటలందుకో ఈ పరుగులో బ్రేకులెందుకో || జింగిలాలో || పాసుపోర్టు లేదు వీసాల గొడవ లేదు వయసు దూసుకెళితే దేశాల హద్దులేదు చాల్లేరా నెల్లూరే వెళ్లాలన్నా బస్ చార్జీ నిల్లేరా ఇల్లాగే ఫారిన్ టూరు వెళ్లేది ఎలారా యు.ఎస్ ని ప్యారిస్ ని ఊహల్లో చూడరా టెక్నికలర్ కలలు కనే టెక్నిక్ మనకుందిరా ఆ నింగికి సైతం నిచ్చెన వేద్దాం మన ఆశకున్న హార్సు పవర్ చూపిద్దాం ఏ ఎల్లలైన చెల్లవంటు చాటిద్దాం శాటిలైటు లాటిదిరా సాటిలేని యవ్వనం పూట పూట వినోదాలు చూపించే సాధనం జింగిలాలో ఏం గింగిరాలో బొంగరాలో ఈ భాంగ్రాలో . ఫిల్మ్ స్టారులంతా మనకేసి చూస్తున్నారు మనం చూడకుంటే మరి ఎలా బతుకుతారు చల్ చల్ రే… పాకెట్లో పైసాలతో పిక్చర్కే పోయొద్దాం పోస్టర్లో పాపకి ఓ డ్రస్సు కొనిద్దాం తాపీగా కూర్చుంటే తోచదురా సోదరా హ్యాపీగా ఎగరడమే మనమెరిగిన విద్యరా ఆ గువ్వలమవుదాం.. రివ్వున పోదాం మేఘాల మీద సంతకాలు చేసేద్దాం ఓ వానవిల్లు కట్టి తిరిగి దిగి వద్దాం తుళ్లిపడే అల్లరితో గొల్లుమనే సంబరం ఆకలనీ దాహమని ఆగదురా ఏ క్షణం || జింగిలాలో || .

Posted by: Mr. Siri Siri At: 15, Nov 2010 4:59:29 PM IST
మాధురిని మరిపించే సుస్మితాని ఓడించే అందమైన అమ్మాయిరో రమ్యకృష్ణ రూపాన్ని చిత్రలోని రాగాన్ని కలుపుకున్న పాపాయిరో |ఖోరస్| ఎవ్వరురా ఆ చిన్నది ఎక్కడరా దాగున్నది ఎప్పుడురా ఎటు నుంచి దిగుతుంది |అతడు| Dream Girl, ఎదలో ఈల వేసే Nightingale Dream Girl, మెడలో మాల వేసే darling Doll . ||చ|| |ఆమె| Hello Honey…Welcome అనీ… అంటూ నీ వైపే ఉన్నాననీ కల్లోన నువ్ లేవనీ గిల్లేసి చూపించనీ వెంటాడినా వేధించినా నీ చెంత చేరాలనీ నమ్మాలి నా మాటని…తగ్గించు అల్లర్లనీ |అతడు| Dream Girl, గుండెల్లోన మోగే Temple Bell Dream Girl, దిగిరా నీలి నింగి Twinkle Star . ||చ|| |అతడు| ఆటాడినా మాటాడినా ఆలోచనంత తానేననీ చెప్పేది ఎల్లాగనీ చేరేది ఏ దారినీ ఎటు పోయినా ఏం చేసినా నా నీడ లాగ అడుగడుగునీ చూస్తున్న ఆ కళ్లని చూసేది ఏనాడనీ |ఖోరస్| Dream Girl… |అతడు| కొంగు చాటు గులాబి ముళ్లు నాటు honey bee ఎక్కడుందో ఆ baby కొంటె ఊసులాడింది heart beat పెంచింది ఏమిటంట దాని hobby |ఖోరస్| మాకేం తెలుస్? వంకాయ పులుస్ no address miss universe Mental case అంతేరా Boss, May God bless you |అతడు| Dream Girl, గుండెల్లోన మోగే Temple Bell Dream Girl, దిగిరా నీలి నింగి Twinkle Star |ఆమె| Dream Girl, నిన్నే తలుచుకుంటే నిద్దర Nil Dream Girl, మనసే తడిసిపోయే Waterfall |అతడు| Dream Girl, త్వరగా చేరుకోవే my darling Dream Girl, ఇంకా ఎంత కాలం ఈ waiting .

Posted by: Mr. Siri Siri At: 15, Nov 2010 4:53:49 PM IST
ఏ రోజైతే చూశానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను ||ఏ రోజైతే|| కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినై నే జీవిస్తున్నాను నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో నీ రూపే నా వేచే గుండెల్లో నిన్నటి నీ స్వప్నం నన్ను నడిపిస్తూ ఉంటే ఆ నీ నీడై వస్తాను ఎటు వైపున్నా నీ కష్టంలో నేనూ ఉన్నాను కరిగే నీ కన్నీరవుతా నేను చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతం ఓదార్పవుతాను . కాలం ఏదో గాయం చేసింది నిన్నే మాయం చేశానంటోంది లోకం నమ్మి అయ్యో అంటోంది శోకం కమ్మి జో కొడతానంది గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా ఆ జీవం నీవని సాక్షమునిస్తున్నా నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ నాలో మోగే గుండెల సవ్వడులే అవి చెరిగాయంటే నే నమ్మేదెట్టా నువు లేకుంటే నేనంటూ ఉండనుగా || నీ కష్టంలో || || ఏ రోజైతే ||

Posted by: Mr. Siri Siri At: 15, Nov 2010 4:50:46 PM IST
వద్దంటె వినడే పోకిరి ముద్దుల్లో ఒకటే కిరికిరి అర్జెంటుగా అహా! ఓహో! అనిపించగా అందాలలో మందారాలే తెంచేసినాడే వద్దంటే విననే రామరి వద్దంటె విననే రామరి ఒళ్ళంత ఒకటే ఆవిరి . ఈ మంచుగాలి కొట్టి వేదించు వేడి పుట్టి ఒళ్ళంత పాకిందమ్మో ఓహో! కవ్వించు కాంక్ష పుట్టి నా సిగ్గు వెన్ను తట్టి నీ వెంట పంపిందయ్యో ఎవరెస్టునైనా కరిగించవా శివమెత్తు నిట్టూర్పులో ఎవరడ్డమయినా ఎదురించవా యువజంట పట్టింపులు రాణి యువరాణి ముడివీడుతున్న కైపు చూపులు ||వద్దంటే|| దేహాలలో మన సందేహాలే తగ్గించగా తాపాలలో ఆహ! సంతాపాలే తప్పించుకోగా ||వద్దంటే|| . పెళ్ళీడు ముంచుకొచ్చి అల్లాడు ఆశ రెచ్చి అల్లేసుకొమ్మందయ్యో పిల్లాడి పంచకొచ్చి కిల్లాడి పిచ్చి పెంచి ఒళ్ళోకి రమ్మందమ్మో మంచాలమైకం దించేయనా ఒయ్యారి లంచాలతో పొంచున్న దాహం దించేయనా విర్జాజి వర్షాలతో కాని తొలి బోణీ రవి చూడలేని కన్నే మోజుతో ||వద్దంటె వినడే||

Posted by: Mr. Siri Siri At: 15, Nov 2010 4:47:38 PM IST
< < Previous   Page: 3 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2024 TeluguPeople.com, All Rights Reserved.