పట్టుకుంటే కందిపోయే మల్లెపూవులా...
ముట్టుకుంటే ముడుచుకుపోయే ముద్దబంతిలా..
కళ్ళతోనే భావాలు పలికించే పడతిలా...
చిరునగవుతో సరాగాలు పాడే సారంగిలా..
నవ్వుతూ నవ్విస్తూ తన సంసారాన్ని
సారవంతం చేసుకొనే సహధర్మచారిణిలా...
అందం, అణకువతో
భర్తకు చేదోడు వాదోడుగా ఉండే ప్రణయ దేవతలా..
పుట్టింటి పరువును నిలబెడుతూ
మెట్టింటి గౌరవం కాపాడే కల్పవల్లిలా..
కట్టుకున్న భర్తను, కన్నబిడ్డల్ని
మురిపించి మైమరపించే మాతృమూర్తిలా..
అత్త మామలను అయిన వారిని
ఆదుకొనే ఆడపడుచులా...
వెరసి పరిపూర్ణ స్త్రీమూర్తిలా..
|