VENKATA KIRAN KUMAR THRIPURARIBHOTLA SHARMA http://www.telugupeople.com/profiles/dkmca10
| VENKATA KIRAN KUMAR THRIPURARIBHOTLA SHARMA wrote at: 12, Oct 2012 3:32:20 AM .......................................శ్రీ రామ జయం................................
:::::::::::::::::::::::::::::::::: భయం :::::::::::::::::::::::::::::::::::
అమావాస్యలో అరుణం రాదు!
కాని పక్షం తరువాత పౌర్ణమి రాక పోదు!
అమావాస్య ఓటమి కాదు పౌర్ణమి గెలుపు అసలే కాదు!
పోటీ పటిమను గుండెల నింపి లోపలి చీకటి పొరలను మింగి!
భయం బాటను వీడిపో యువతా!
కన్నుల ఎదుట కాలపు పిశాచి
కలల వెనుక విజయాల విపంచి
కండల చాటున పోరాటపు పోకడ
భయాని కప్పి జయాన్ని ఒప్పి
కదిలే కాలికి----
కాలమాగేను కలలు తీరేను!
పోరాటం ఫలించేను!
ఝంఝాపవన గాలికి ఈకలు కదులు, తీగలు కదులు!
గంగా జలల తకిది దెబ్బకు రాళ్ళు కదులు రప్పలు కదులు!
అగ్ని పర్వత అరాచకానికి కొండలు, బండలు కరిగేనసలు!
అన్నిటికంటే గొప్ప మనిషి భయం భ్రాంతికి బ్రతుకే వదులు!
గుండెలనిండ ధైర్యం నిండుగ
కదిలే గమనం విజయం వైపుగ
కన్నులలో భయం ఉండగ
కలలై పోవును వచ్చే పండుగ!
లేదని వారించు నీకు ఏ భయం!
చేదనే రుచే ఉండదు నీకదే అభయం!
భయం మాయం విజయం ఖాయం!
..................................కిరణ్ కుమార్.....8978706835................
| | Login to post your comments / feedback! Login Box is below... | | kalpana kondapalli wrote at: 18, Oct 2012 8:16:45 PM really nice
| | kalpana kondapalli liked at: 18, Oct 2012 8:16:27 PM |
Login to Start connecting with VENKATA KIRAN KUMAR and over a Million other Telugu people world-wide!
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|