PRASAD ATLURI http://www.telugupeople.com/profiles/Atprasad
| PRASAD ATLURI wrote at: 20, Feb 2012 2:09:45 AM ఆడపిల్లను నేను అందాల బొమ్మను నేను Saturday, November 26, 2011
అమ్మానాన్నలకు 'అక్కర్లేని అదృష్టాన్ని ' నేను
నానీ తాత లకు 'నచ్చని దురదృష్టాన్ని' నేను
పాప గా రూపుచెందిన నన్ను
పరజ్ఞానం పరిహాసం చేసింది
ముద్దుచేయాల్సిన వాళ్ళు వద్దు పొమ్మన్నారు
పెనవేసిన బంధాన్ని పెకలించి వేశారు
చిన్నదాన్ని అని చూడకుండా చిదిమేశారు
చెత్తలో వేసే ముందైనా చూడాలనిపించాలేదా మీకు
నా ముక్కు నీ ముక్కు లానే ఉంటుందమ్మా
నా కళ్ళు నీ కళ్ళు లానే ఉంటాయి నాన్నా
నేను అచ్చం అన్నయ్య లానే ఉన్నానే!
అయినా నన్ను అంతం చేసారేం?
పసుపక్షాదులకు లేదు ఈ పక్షపాతం
విచక్షణ ఉన్న మీకెందుకీ పక్షవాతం
నా క(అ)న్న వాళ్ళు ఇంత కసాయి వాళ్ళా
అమ్మానాన్నలా మీరు ? ఆది దేవుళ్ళా మీరు?
చిన్నదాన్ని అడుగుతున్నా చీదరించక చెప్పమ్మా
అమ్మమ్మ కుడా నీలాగే ఆలోచిస్తే నువ్వెలా బ్రతికేదానివమ్మా
బ్రహ్మ చేసిన బొమ్మ బరువవుతుందని ఎలా అనుకున్నావమ్మా! ......ప్రసాద్ అట్లూరి
| | Login to post your comments / feedback! Login Box is below... |
Login to Start connecting with PRASAD and over a Million other Telugu people world-wide!
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|