PRASAD ATLURI http://www.telugupeople.com/profiles/atprasad
| PRASAD ATLURI wrote at: 20, Feb 2012 2:10:41 AM రాజకీయం
రాజకీయం అంటే.
రాజీలేని కయ్యాలమయం
రూల్స్ లేని రణరంగం
రగులుతున్న రావణ కాష్టం
ఉగిపోతున్న ఊబకాయం
మరచిపోయిన మంచితనం
వలచి పారేసిన విలువలు
కలుపుకోలేని కరములు
కలసి సాగలేని అడుగులు
రాజకీయం అంటే....
పొర్లిన బురదని జల్లటం
పోగేసిన దుమ్మెత్తి పోయటం
గెలిచిన సీట్లు వదలటం
వదిలిన సీట్లు గెలవటం
రోజుకో జెండా , నేలకో అజెండా
రోజుకో వేషం ,రోజూ సంశేషం
ఓట్లు కోసం నోట్లు, నోట్లు కోసం సీట్లు
వివేకానంద వైనం, గురవింద నైజం
కానీ ఎన్నాళ్ళు ఇలా, ఎన్నేళ్ళు ఇలా
రాజకీయమంటే ఇలాగేవుండాలా!
మార్చాలేమా గతం, చేరలేమా గమ్యం
యువకుల్లారా ముందడుగేయండి
కొత్తరక్తం తో కళంకాన్ని కడిగేయండి
రాజకీయాల్ని వృత్తిగా స్వీకరించండి
ఈ భారత్ మనది భవిత మనది భాద్యతా మనదే
...............అట్లూరి ప్రసాద్.
| | Login to post your comments / feedback! Login Box is below... |
Login to Start connecting with PRASAD and over a Million other Telugu people world-wide!
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|