అవి పరిచయ సమావేశాలా!
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలపై పార్టీ అభ్యర్ధులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్ధులను ఎంపికచేసి, భి-ఫామ్ లు ఇచ్చే సమయంలో చిరంజీవి లేరు. అందువల్ల రాష్ట్రంలో తమ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్ధులు ఎవరు? వారి గత చరిత్ర ఏమిటి? ్నేవి తెలుసుకోడానికే ఈ సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయని పార్టీ ్భ్యర్ధులు చెబుతున్నారు. వీటిని సమీక్షా సమావేశాలు అనేకంటె ఒకరకంగా పరిచయ సమవేశాలు అంటే బాగుంటుందని మెదక్ జిల్లాలో ఒక అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన ప్రజారాజ్యం అభ్యర్ధి వ్యాఖ్యానించారు.
ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తమ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్ధులను నాయకత్వం గుర్తుపట్టే స్థితిలో లేదని, అందుకే సమీక్షా సమావేశాలని చెప్పి వివిధ నియోజకవర్గాల అభ్యర్ధులను పరిచయం చేసుకుంటున్నారని కొంతమంది అభ్యర్ధులు తెలిపారు. ఈ సమావేశాల్లో చిరంజీవి, ఆయన బావమరిది అల్లు అరవింద్ మాత్రమే ఉంటున్నారు. పవన్ కల్యాణ్ వాటికి దూరంగా ఉంటుండగా, డాక్టర మిత్రా మొక్కుబడిగా వచ్చి వెళ్తున్నారు. సమీక్షా సమావేశాల గురించి ప్రశ్నించగా, తాను వాటికి సంబంధించిన కమిటీలో సభ్యుడిని కానని, అన్ని వివరాలు చిరంజీవినే అడిగి తెలుసుకోండని సీనియర్ నాయకుడు కోటగిరి విద్యాధరరావు చెప్పారు.
Pages: 1 -2- News Posted: 3 May, 2009
|