వైఎస్ మహాప్రస్థానం షూటింగ్
కడప : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి జీవిత విశేషాలతో కూడిన వై.ఎస్ మహాప్రస్థానం డాక్యుమెంటరీ ముగింపు షూటింగ్‌ను ఈ నెల 16,17 తేదీలలో పులివెందుల చుట్టుపక్కల షూటింగ్ చేస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు పిసి ఆదిత్య తెలిపారు. మంగళవారం గోపివిహార్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిత్య మాట్లాడుతూ వైఎస్ ప్రజలకు చేసిన సేవలకు ఆకర్షితుడినై ఆయన జీవిత చరిత్రపై డాక్యుమెంటరీ చేయాలని సంకల్పించామని పేర్కొన్నారు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలకు కోట్లాది మంది ఆకర్షితులయ్యారని, అందులో నేను ఒకడిని అన్నారు.
మెదక్ జిల్లా చేవెళ్లలో సెప్టెంబరు 9న ఈ షూటింగ్‌ను ప్రారంభించామన్నారు. వైఎస్ జీవిత విశేషాలను భావతరాలకు అందించాలన్నదే తమ డాక్యుమెంటరీ ఉద్ధేశ్యమన్నారు. ఆ మహానాయకునికి ఇదే మేమిచ్చే నివాళి అన్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో వైఎస్ మహాప్రస్థానం షూటింగులో జిల్లాలోని వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు జెండాలను చేతబట్టి షూటింగ్లో పాల్గొని మహానాయకునికి నివాళులు అర్పించాలని ఆదిత్య ప్రజలకు పిలుపునిచ్చారు.
News Posted: 11 November, 2009
|