రూపాయికి 'గుర్తు' కావాలి
న్యూఢిల్లీ: డాలరు, పౌండ్-స్టెర్లింగ్, యెన్, యూరోల్లాగా రూపాయిని కూడా ఒకానొక గుర్తుతో వ్యక్తం చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. రూపాయిని వ్యక్తం చేసే గుర్తుల్ని సూచించమని ప్రజల్ని భారత ప్రభుత్వం కోరింది. 'ఈ గుర్తు భారత దేశ చారిత్ర, సాంస్కృతి విశిష్టతలను తెలిపే విధంగా ఉండాలి, సర్వ జనామోదం పొందే విధంగా ఉండాలి ఆ గుర్తు 'ప్రామాణిక కీ బోర్డులో ఇమిడే విధంగాను, భారత జాతీయ లిపి లేదా దృశ్య ప్రతిరూపంగా ఉండాలి'అని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
భారత కరెన్సీ రూపాయిని వ్యక్తం చేసే గుర్తును సూచించేవారు ఏప్రిల్ 15 లోగా ఎంట్రీలను పంపాల్సి ఉంటుంది. ఈ ఎంట్రీలను ఒక ప్రత్యేకమైన అయిదు మంది సభ్యుల జ్యూరీ పరిశీలించి నిర్ణయిస్తుంది.ఈ జ్యూరీని ప్రసిద్ధ కళా క్షేత్రాలను ముగ్గురు కళాకారలను, ప్రభుత్వం నుండి, రిజర్వ్ బ్యాంకు నుండి ఇద్దరు ప్రతినిధులతో ఏర్పాటు చేస్తారు. మొత్తం ఎంట్రీల నుండి అయిదింటిని ఎంపిక చేస్తారు. ఆ దశలో ఈ ఎంట్రీలను పంపినవారు తాము రూపొందించిన గుర్తుల గురించి జ్యూరీకి వివరించవలసి ఉంటుంది. అందులో నుండి ఒక గుర్తును జ్యూరీ ఎంపిక చేస్తుంది. గెలిచిన వారికి 2.5 లక్షల రూపాయల్ని పారితోషికంగా అందిస్తారు. చివరిగా ఎంపికైన అయిదు ఎంట్రీల్లో మిగిలిన వారికి 25 వేల రూపాయల చొప్పున పారితోషికాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఎంపిక చేసిన ఆకృతి ప్రభుత్వ ఆస్తిగా మారుతుంది.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|