చర్చ తరువాతే బిల్లు: కేంద్రం న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లుపై అన్ని పార్టీలతో చర్చించిన తరువాత మాత్రమే లోక్ సభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రప్రభుత్వం గురువారం స్పష్టంచేసింది. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ విషయం మీడియాకు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న లాలూ, ములాయం, శరద్ యాదవ్ లతో ఆయన గురువారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు మమతా బెనర్జీ, శరద్ పవార్, డిఎంకె నేత టిఆర్ బాలు కూడా పాల్గొన్నారు. బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్న మిత్రపక్షాల డిమాండ్ పై స్పందిస్తూ ఆ విషయంలో ఎలాంటి స్పష్టతా లేదని ప్రణబ్ వ్యాఖ్యానించారు. అందరి అభిప్రాయాలు తీసుకుని, వారి అభ్యంతరాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రధాని అన్నారన్నారు.
News Posted: 11 March, 2010
|