రీపోస్టుమార్టం వద్దు: హైకోర్టు హైదరాబాద్: ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు నేత శాఖమూరి అప్పారావు మృతదేహానికి రీపోస్టు మార్టం అవసరంలేదని హైకోర్టు పేర్కొంది. శాఖమూరి అప్పారావు, కొండలరెడ్డిల ఎన్‌కౌంటర్లపై హైకోర్టులో పౌర హక్కుల సంఘం పిటీషన్ దాఖ లు చేసింది. పోలీసులపై 302 కేసు పెట్టాలని రీపోస్టుమార్టం చేయించాలని కోరారు. దీనిపై కోర్టు శనివారం విచారణ జరిపింది. అప్పారావు మృతదేహానికి రీపోస్టు మార్టం అవసరంలేదని, కొండల్‌రెడ్డి మృతదేహానికి మాత్రం వైద్య నిపుణులతో పోస్టు మార్టం నిర్వహించాలని కోర్టు పేర్కొంది. ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపై 302 కేసు పెట్టాలన్న పిటీషనర్ వాదనపై విచారణను మాత్రం వారం రోజులపాటు వాయిదా వేసింది.
News Posted: 13 March, 2010
|