ఎన్నటికీ అనుకోలేదు చిట్టి చెల్లీ
నీకింత కష్టం వస్తుందని..
కలలో అయిన ఎరగను బంధువులే
నీ పాలిట రాబందులు అవుతారని
పురాణ ఇతిహాసాలలోని రాక్షసులే
కలియుగంలో కరుణ లేని మనుషులై
నీ చావుకు కారణం అవుతారని
ఎలా అనిపించిందమ్మా చిరునవ్వులొలికే
నిన్ను చితిమీదకు చేర్చాలని..
నాన్న కూడా నీవు కనిపించని పాడులోకం నాకెందుకు
బంగారు తల్లీ, నువు డాడీ అని పిలవని ఈ దుర్మార్గపు లోకంలో
నేనుండలేను, నీ చెంతకే వస్తాను అంటూ లోకం వదిలారే..
ఇప్పుడే తెలిసింది లోకానికి మీ బంధం ఏమిటో
దేవుడు సైతం ఎరుగని అనురాగం ఏమిటో...
ఓ చిన్నారి చిట్టి వైష్ణవీ నీకు ఇది అంకితం..
|