కావాలసిన పదార్థాలు :
శనగలు : పావుకిలో
టొమాటాలు : రెండు
ఉల్లిపాయలు : రెండు
కీర : ఒకటి
కొత్తిమీర : ఒక కట్ట
పచ్చిమిర్చి : ఆరు
కొబ్బరి కోరు: అరకప్పు
క్యారెట్ తురుము : పావు కప్పు
చాట్ మసాలా : టీ స్పూన్
నిమ్మరసం : టీ స్పూన్
కారం : అర టీ స్పూన్
ఉప్పు తగినంత
తయారు చేయు విధానం : శనగలను ఒక రోజు ముందు నానబెట్టుకోవాలి. మరునాడు వాటిని కుక్కర్ లో ఉడికించిన తర్వాత నీళ్ళు లేకుండా మరో పాత్రలోకి తీసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను, కొత్తిమీరను, పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ కోవాలి. వీటితోపాటు కార్యారెట్ తురుము, కొబ్బరి కోరు, ఉప్పు, కారం, చాట్ మసాలాలను ఉడికించి పెట్టుకున్న శనగలలో కలుపుకోవాలి. ఇష్టమైన వారు తాలింపు పెట్టుకోవచ్చు. తర్వాత నిమ్మరసం పిండుకోవాలి. చివరగా టొమాటో, కీర ముక్కలను అలంకరించుకొని సర్వ్ చేసుకోవాలి.
|