'పున్నమినాగు' రివ్యూ
పాములు పగబట్టి ప్రతీకారం తీర్చుకునే కథాంశాలతో వచ్చిన పలు చిత్రాలు ప్రేక్షకాదరణ చూరగొన్న సందర్భాలు గతంలో ఉన్నాయి. హిందీ 'నాగిన్'ను ఇప్పటికీ మరచిపోని జనం ఉన్నారు. ఏవిఎం బ్యానర్ లో వచ్చిన 'నోము' అప్పట్లో పెద్ద హిట్. గిరిబాబు తీసిన 'దేవతలారా దీవించండి' చిత్రం కమర్షియల్ హిట్. పగ-ప్రతీకారం వంటి అంశంతో కాకపోయినా...ఒంటినిండా విషప్రయోగం జరగడంతో ప్రతి పున్నమికి ఓ కన్యను పొట్టనబెట్టుకుంటూ చివరకు పశ్చాత్తాపంతో తనను తానే శిక్షించుకున్న యువకుడి కథాంశంతో చిరంజీవి కథానాయకుడుగా సుమారు 3 దశాబ్దాల క్రితం వచ్చిన 'పున్నమినాగు' సైతం ప్రేక్షకాదరణ చూరగొంది. నిజానికి హిట్టయిన సినిమాల పేర్లను పదేళ్ల తర్వాత ఎవరైనా మళ్లీ వాడుకోవచ్చు. హిట్ సినిమా టైటిల్స్ ఎంత అడ్వాంటేజ్ అవుతాయో...ఆ టైటిల్ పెట్టుకుని సరైన అవుట్ పుట్ ఇవ్వకపోతే అంతకంటే ఎక్కువగా చులకనవుతాయి. జనం ఆ రెంటినీ పోల్చుకుని శల్యపరీక్ష తర్వాతే తీర్పు చెబుతుంటారు.
చాలా కాలంగా ఇండస్ట్రీకి కానీ, తనకు పేరు తెచ్చిపెట్టిన నవలా సాహిత్యానికి గానీ గుడ్ బై కొట్టిన యండమూరి వీరేంద్రనాథ్ చేత కథ రాయించుకుని, సెక్సీ బాంబ్ ముమైత్ చేత ఏకంగా రెండు పాత్రలు చేయించి...పాత టైటిల్ నే ఉపయోగించుకుంటూ 'పున్నమినాగు' చిత్రాన్ని కోదండరామిరెడ్డి తాజాగా జనం మీదకు వదిలారు. బహుశా పేపర్ వర్క్ వరకూ 'పున్నమినాగు' బాగుండి ఉండొచ్చు. కానీ అది తెరకెక్కిన తీరు చూస్తే కోదండరామిరెడ్డి నూరు చిత్రాల విశేషానుభవం ఎక్కడికి పోయింది? ఆయనలోని ఆలోచనలు నిజంగానే డ్రై అయిపోయాయా? 'వాలంటరీ' తీసుకుంటే ఉన్న పేరైనా మిగలచ్చేమో?..అనే అభిప్రాయలకు తావిస్తుంది. కుటుంబ కథా చిత్రాలు, పక్కా కమర్షియల్ చిత్రాలు తీయడంలో కె.రాఘువేంద్రరావు వంటి దిగ్గదర్శకుడు గట్టి పోటీ ఇచ్చిన కోదండరామిరెడ్డి ఇవాల్డి ట్రెండ్ ను విశ్లేషించుకోవాల్సిన అగత్యాన్ని ఈ చిత్రం కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంది. 'పున్నమినాగు' తీరుతెన్నులు ఓసారి పరికిద్దాం.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|