'ఆ ఒక్కడు' రివ్యూ
పవిత్ర (మధురిమ) ఓ సైకియాట్రిస్ట్. క్రిమినల్ కేసుల దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తూ ఉంటుంది. రైటైర్డ్ మేజిస్ట్రేట్ అయిన తన తండ్రి (విజయ్ చందర్), అక్క కూతురుతో కలిసి ఉంటుంది. తన సోదరి చావుకి బావే కారణమని భావించిన పవిత్ర ఆ చిన్నపిల్లను అతని కస్టడీకి పంపపాడానికి నిరాకరిస్తుంటుంది. పాప కస్టడీ కోసం బావ కోర్టులో కేసు వేస్తాడు. కోర్టు తీర్పు ఆమె బావకే అనుకూలంగా వస్తుంది. అయితే దుర్మార్గుడైన బావ దగ్గరకు పాపను పంపేది లేదనీ, అవరసమైతే అతన్ని చంపేస్తానని కోర్టు బయట ఆవేశంగా పవిత్ర చెబుతుంది. అనూహ్యంగా ఆ మరుసటి రోజే పవిత్ర బావ హత్యకు గురువుతాడు. దాంతో ఎసిపి సురేంద్ర బాబు (నాజర్) ఆమెను అనుమానిస్తాడు. పవిత్ర పైన అవ్యాజమైన అనురాగం ఉన్న ఓ అజ్ఞాత వ్యక్తి ఆమెకు ఫోను చేసి నువ్వు చేయమంటేనే ఆ హత్య చేశానంటూ చెబుతాడు. ఆ అజ్ఞాత వ్యక్తి ఒకప్పుడు తన వద్ద మానసికి వ్యాధితో చికిత్స తీసుకున్న వారిలో ఒకరై ఉండవచ్చని పవిత్ర అనుమానిస్తుంటుంది. ఆ విషయాన్ని ఎసిపికి చెబుతుంది. ఎసిపి ప్లాన్ చేసి ఆ అజ్ఞాత వ్యక్తిని అదుపులో తీసుకుంటాడు. సూరి అనే ఆ హంతకుడు బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానిసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిగా గుర్తిస్తారు. కొన్ని కారణాల వల్ల సూరి కేసును ప్రముఖ క్రిమినల్ లాయర్ శ్రీకృష్ణ (సురేష్ గోపి) చేపడతాడు. బొంగరాల బుజ్జి (అజయ్) అతని అసిస్టెంట్. అంతకుముందే బుజ్జికి పవిత్ర పరిచయమవుతుంది. సూరి కేసును శ్రీకృష్ణ టేకప్ చేయడం ఇష్టంలేని బుజ్జి పవిత్రకు అండగా నిలుస్తాడు. మరో వైపు ఓ బాబాజీ హత్యకు గురవుతాడు. శ్రీకృష్ణతో పాటు పవిత్ర ఫ్యామిలీ కూడా ఆ బాబాజీ శిష్యులే. ఈ హత్యకేసులో పవిత్రను పోలీసులు అనుమానిస్తుంటారు. పవిత్ర వరుస చిక్కుల్లో పడడం వెనుక ఎవరి ప్రమేయం ఉంది? ఆ 'ఒక్కడు' ఎవరు? అనేది క్లైమాక్స్ లో తేలుతుంది.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3- -4-
|