మల్లన్న' రివ్యూ
దేవీశ్రీప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. 'అలెగ్రా...' సాహిత్యం అర్థం కానున్నా ట్యూన్ క్యాచీగా ఉంది. 'మియావ్ మియావ్ పిల్లీ..', 'మాంబో మామియా' పాటలు, చిత్రీకరణ ఆకట్టుకుంటాయి. ఏకాంబరం ఫోటోగ్రఫీ చాలా సందర్భాల్లో స్టన్నింగ్ గా అనిపించినా కలర్ గ్రేడింగ్ అక్కడకక్కడా సరిగా కుదర్లేదు. ఎడిటింగ్ ఎక్కువ మంది చేతిలో పడటం వల్లనో ఏమో సన్నివేశాలు అర్ధంకాని గందరగోళం కనిపిస్తుంది. కలైపులి థాను గ్రాండ్ స్కేల్ లో నిర్మాణ విలువలు పాటించారు.
విక్రమ్ ను సూపర్ హీరోగా చూడాలనే క్రేజ్, శ్రియ గ్లామర్, దేవీశ్రీ సంగీతం, రిచ్ లొకేష్లు సినిమాకు హైలైట్స్ అయితే, స్క్రీన్ ప్లే పట్టుగా లేకపోవడం, ఎడిటింగ్, పలు సినిమాల ఛాయలు ఇందులో కనపడటం బలహీనతలు. 3.10 నిమిషాల నిడివి కూడా ఇబ్బంది కలిగించే అంశం. రెండేళ్లుగా నెలకొన్న భారీ అంచనాల కారణంగా 'దశావతారం' తరహాలో భారీ ఓపినింగ్స్ కు మాత్రం ఢోకా
ఉండదు. కమర్షియల్ మషాలాలతో తృప్తిపడాలనుకుంటే ఓపరి 'మల్లన్న'ను చూడొచ్చు.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|