'జోష్' రివ్యూ
అక్కినేని ఫ్యామిలీ అనే గుర్తింపు వెనుక ఏడు దశాబ్దాల కృషి ఉంది. లివింగ్ లెజెండ్ అక్కినేని తన 17వ ఏట పరిశ్రమలోకి అడుగుపెడితే, ఆయన తనయుడు నాగార్జున 27వ ఏట, మనువడు నాగచైతన్య మధ్యస్తంగా 23వ ఏట పరిశ్రమలోకి 'జోష్'తో అడుగుపెట్టారు. నట వారసత్వం పరిశ్రమలోకి సునాయాసమైన ఎంట్రీని ఇస్తుంది కానీ...అంచనాల 'భారం' మాత్రం పెంచుతుంది. ముఖ్యంగా మూడో తరం వారసులకు ఈ టెన్షన్ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఏ వయసు ముచ్చట ఆ వయసుదన్నట్టు కొత్త తరం నటులకు కాలేజీ స్టోరీలే సేఫ్ జోన్. స్టూడెంట్ లైఫ్ అందరికీ అనుభవైక వైద్యమే కాబట్టి ఆ పాత్రలో నెర్వస్ నెస్ ఉండదు. రియల్ లైఫ్ లోని అనుభవాలను క్యారెక్టర్ కి కనెక్ట్ చేయవచ్చు. నాగచైతన్య ఇప్పుడు కాలేజీ స్టూడెంట్ గానే తొలి అడుగు వేశాడు. 'ఎవరి మాట వినని వాడే స్టూడెంట్' అంటూ నవతరం స్టూడెంట్ల వైఖరిని సమర్ధిస్తూనే, 'తప్పు కాలేజీలది కాదు ఆ ఏజ్ ది. స్టూడెంట్లను ఎవరూ మార్చలేరు. ఎవరికి వారే మారాలి' అని స్టూటెంట్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు వాసువర్మ. మరోవైపు బలీయమైన యంగ్ జనరేష్ కావాలంటూ ర్యాంక్ ల కోసం తల్లిదండ్రులు, అధ్యాపకులు యువతపై తెస్తున్న ఒత్తిడి తట్టుకోలేక వారు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే బలీయమైన యువ శక్తి ఎక్కడి నుంచి వస్తుందని విద్యార్థి పాత్రలో కథానాయకుడితో చెప్పించడంలో కొంత సహేతుకత కనిపిస్తుంది. ఇదేసమయంలో 'కాలేజీ పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది. కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం చెబుతుంది..గుణపాఠం' అంటూ కాలేజీ జీవితాన్ని ఆటపాటలు, దురలవాట్లు, ర్యాకింగ్ ల పేరుతో దుర్వినియోగం చేసుకుంటే భావి జీవితం బుగ్గిపాలవుతుందనే హెచ్చరిక కూడా కథాక్రమంలో చోటుచేసుకుంది. ఇలా మెసేజ్ ఓరియెంటెడ్ ఇతివృత్తంగా 'జోష్' నడక సాగుతుంది.
Read 4 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|