'బంపర్ ఆఫర్' రివ్యూ
సాంకేతికపరంగా రఘకుంచె సంగీతాన్ని ప్రత్యేకంగా ముచ్చటించుకోవాలి. గాయకుడుగా మంచి పేరు తెచ్చుకున్న రఘ ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా మారారు. ముఖ్యంగా ఆయన కంపోజ్ చేసిన ఎందుకే 'రవణమ్మా...పెళ్లెందుకే రమణమ్మా' పాట ఆడియెన్స్ ను మునివేళ్ల మీద నాట్యం చేయిస్తుంది. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ కూడా ఫరవాలేదు. పూరీ జగన్నాథ్ సంభాషణలు ఓకే. 'ఠాగూర్ చూసి అందరూ ఠాగూర్లు అయిపోరు. పోకిరి చూసి అంతా పోకిరీలు అయిపోరు', 'మిడ్ నైట్ లో మగాళ్లకు సేఫ్టీ లేకుండా పోయింది', 'ఆ జన్మలో కోడిపెట్టి ఈ జన్మలో కోడిపుంజుగా మారింది' వంటి సంభాషణలు నవ్విస్తాయి. పూరీ జగన్ నిర్మాణ విలువలు తిగినట్టుగానే ఉన్నాయి.
సినిమా ప్రథమార్థం కొంతవరకూ ఫరవాలేదనిపించినప్పటికీ ద్వితీయార్థం ఊహించిన విధంగానే సాగడం, బలహీనమైన కామెడీ ఓ సాదాసీదా చిత్రాన్ని చూసిన అనుభూతినే మిగులుస్తాయి. ఓవరాల్ గా.. రఘు కుంచె సంగీతం, కొంతవరకూ పూరీ సంభాషణలు మినహాయిస్తే 'బంపర్ ఆఫర్' ఎలాంటి 'ఆఫర్' ఇవ్వలేకపోయిందనే చెప్పాలి. మాస్ ప్రేక్షకులే ఆక్సిజన్ ఇవ్వాలి.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|