295 ప్రింట్లతో 'సలీమ్'
మంచు విష్ణువర్దన్, గ్లామర్ నటి ఇలియానా జంటగా వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, రిలయెన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించిన 'సలీమ్' చిత్రం ఈనెల 11న భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ సెంటర్లలో కూడా విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలో 36 ప్రింట్లతో విడుదలకు సిద్ధం చేస్తుండగా, ఢిల్లీలో 5 ప్రింట్లతో రిజీల్ కానుంది. ఓవరాల్ గా 295 ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత డాక్టర్ ఎం.మోహన్ బాబు సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో 102 డిజిటల్ ప్రింట్లు ఉండటం విశేషం. 23 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది.
క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీపడకుండా ఏడాదికి పైగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంది. వై.వి.ఎస్. చౌదరి సూపర్ హిట్ చిత్రం 'దేవదాసు' తర్వాత ఇలియానా మరోసారి ఆయన కాంబినేషన్ లో నటించగా, విష్ణుతో కలిసి నటించడం మాత్రం ఇదే ప్రథమం. ఇందులో మోహన్ బాబు నెగిటివ్ టచ్ ఉన్న డాన్ పాత్రలో పుష్కలమైన ఎంటర్ టైన్ మెంట్ అందించబోతున్నారు. ఆయనకు జోడిగా కావేరి ఝా నటించింది. గిరిబాబు, నెపోలియన్, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, ముఖేష్ రుషి ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి చింతపల్లి రమణ మాటలు, చంద్రబోస్ పాటలు, సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, సందీప్ చౌతా సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|