'వాడే కావాలి' రివ్యూ
దర్శకుడు రాజేంద్ర దర్శన్ దాదాపు ఎలాంటి ట్విస్ట్ ల జోలికి వెళ్లకుండా కథను స్ట్రయిట్ నేరేషన్ లో నడిపించారు. ప్రథమార్థంలో లవ్ ఎపిసోడ్స్ కు ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ క్రమంగా సెంటిమెంట్ డోస్ డామినేట్ అవుతూ వచ్చింది. కామెడీ ట్రాక్ పేలవంగా ఉండటంతో పాటు కథాగమనానికి అడ్డుపడటం కనిపిస్తుంది. 'ఆనంద్ ప్రేమకు అట్రాక్ట్ కాకుండా ఉండటానికి ఎంత మానసిక సంఘర్షణ పడ్డానో' అని హీరోయిన్ చేత చివర్లో చెప్పించినప్పటికీ ఆమె సంఘర్షణ పడినట్టు చూపే పవర్ ఫుల్ ఘట్టాలు లేవు. అయితే మలేసియా ఎపిసోడ్ నుంచి కథలో తగినంత ఫోర్స్ వచ్చింది. దర్శకుడు ఇచ్చిన ఫైనల్ కంక్లూజన్ కూడా యాప్ట్ గానే ఉంది.
సాయిరాం శంకర్ బాడీ లాంగ్వేజ్, స్టైల్, మేకప్, కాస్ట్యూమ్స్ విషయంలో తీసుకున్న శ్రద్ధ మెచ్చుకోలుగా ఉంది. నిజానికి 'బంపర్ ఆఫర్' లో కంటే ఇందులో ఫ్రెష్ గా ఉన్నారు. ఫైట్స్, డాన్స్ లు కూడా అలరిస్తాయి. సెంటిమెంట్ సన్నివేశాల్లో నటించేటప్పుడు మరింత మెచ్యూరిటీ అవసరం. సుహాసి క్యూట్ గా ఉంది. బరువైన పాత్ర అయినప్పటికీ ఉన్నంతలో బాగానే చేసింది. అభిరామ్ గా చేసిన చంద్రహాస్ (తొలి పరిచయం) తన పాత్రను మంచి ఈజ్ తో చేశాడు. సాయిరాం శంకర్ తండ్రిగా సీనియర్ నరేష్ తన పాత్రకు న్యాయం చేశారు. హెయిర్ స్టయిల్ మాత్రం ఎబ్బెట్టుగా ఉంది. హేమ, చిత్రం శ్రీను తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. రఘబాబు-వేణుమాధవ్ ల మధ్య నడిచిన కామెడీ ట్రాక్ సాదాసాదీగా ఉంది. కేవలం చూడటమే తప్ప నవ్వుకోలేం. 'ఆలీ..ఐ యామ్ జాలీ' అంటూ మలేసియా డ్రైవర్ గా ఆలీ ఓ రెండు మూడు సన్నివేశాల్లో ఫరవాలేదనిపించుకుంటాడు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|