'బిందాస్' రివ్యూ
సినీ పరిభాషలో సక్సెస్ కు ఇదీ ఫార్ములా అని ఎవరూ ఇతమిద్ధంగా నిర్వచించి చెప్పలేరు. అలా చెప్పగలితే ఫెయిల్యూర్స్ అనేవే ఉండవు. అయితే సేఫ్ ఫార్ములా అనేది మాత్రం ఒకటుంటుంది. మాస్ కు యాక్షన్, క్లాస్ కు వినోదం మిక్స్ చేస్తే అది ఎంతోకొంత సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది. ప్రేక్షకులు కూడా బిందాసే. నిన్న మొన్నటి కృష్ణ..ఢీ..రెడీ...కిక్..సరిగ్గా ఇదే ఫాలో అయ్యాయి. ఇవాల్టి ఫిల్మ్ మేకర్స్ చర్విత చర్వణంగా నలిగిన స్టోరీ లైన్ ను ఎంచుకుంటున్నా కథనంతో ప్రేక్షకుడ్ని సీటు కదలకుండా చేసిన వారు మాత్రమే నిలదొక్కుకుంటున్నారు. 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి హిట్ చిత్రాలకు కథా రచన చేసిన వీరుపోట్ల ఎప్పట్నించో దర్శకుడు కావాలని తపించి తన కలను 'బిందాస్'తో సాకారం చేసుకున్నారు. దర్శకత్వంతో పాటు కథ, కథనం, మాటలు అన్నీ తానే అయి బాక్సాఫీస్ ను ఆకట్టుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ నూ టచ్ చేశారు. దర్శకుడిగా బాసటగా సరైన పబ్లిసిటీ ఇవ్వగల నిర్మాతలు కూడా ఇటీవల కాలంలో అరుదై పోయారు. పెట్టుబడి పెట్టాం...అమ్మేసుకున్నాం..శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ తో మన డబ్బులు వచ్చేసాయ్...ఇక మన పనైపోయిందని చేతులు దులుపేసుకుంటున్నారు. ఇందుకు భిన్నంగా మా సినిమా '50 శాతం మాస్...50 శాతం క్లాస్..100 శాతం బిందాస్' అంటూ...'సినిమా చూసి నచ్చకపోతే డబ్బులు వాపసు ఇస్తాం'...'100 రోజుల వరకూ రోజుకో లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయలు బహుమతులు ఇస్తాం'...'దిస్ ఈజ్ నాట్ ఎ లవ్ స్టోరీ...ఇట్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ లవ్' అంటూ ప్రేక్షకులను ఆలోచింపజేసే పబ్లిసిటీతో నిర్మాత సుంకర రామబ్రహ్మం 'బిందాస్'కు ఇచ్చిన ప్రీ-పబ్లిసిటీ ఆయనకు సినీ నిర్మాణంపై ఉన్న పాషన్, తన ప్రోడక్ట్ పై ఉన్న నమ్మకాన్ని చాటుతోంది. అందుకు తగ్గట్టే 'బిందాస్' ప్రామిసింగ్ గా ఉందా? ప్రేక్షకులు కూడా బిందాసేనా? ఓసారి చూద్దాం...
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|