'కరెంట్' ట్రిపుల్ ప్లాటినం
సుశాంత్, స్నేహ ఉల్లాల్ జంటగా అన్నపూర్ణా స్టూడియోస్ సమర్పణలో శ్రీ నాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'కరెంట్'. సూర్యప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలై అన్ని ఏరియాల్లోనూ చక్కటి ఓపినిగ్స్ తో విజయపథంలోకి దూసుకెళ్తోంది. దేవీశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ పెద్ద హిట్ తో ఆడియోపరంగానూ సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఆడియో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేతంగా కన్నులపండువగా జరిగింది. సుశాంత్, స్నేహ ఉల్లాల్, దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రంలోని పాటలకు స్టేజ్ పై డాన్స్ చేయడం హైలైట్ గా నిలిచింది.
సుశాంత్ మాట్లాడుతూ, తాను నటించిన రెండో చిత్రమే మ్యూజికల్ గా ఇంత పెద్ద హిట్ కావడం తన అదృష్టమనీ, ఇందుకు కారకులైన ప్రేక్షకులు, ముఖ్యంగా అక్కినేని అభిమానులకు సదా రుణపడి ఉంటాననీ అన్నారు. తాను దేవీశ్రీ ప్రసాద్ ఫ్యాన్ అనీ, ఎంతో బిజీగా ఉన్నప్పటికీ దేవీశ్రీ ఈ చిత్రాన్ని అంగీకరించడమే గాక మ్యూజికల్ హిట్ అందించారనీ పేర్కొన్నారు. దర్శకుడు ప్రతాప్ ప్రతీ సీన్ ను అద్భుతంగా తెరకెక్కించారనీ, అలాగే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లకు తన కృతజ్ఞతలనీ అన్నారు. సూర్యప్రతాప్ మాట్లాడుతూ, సినిమా విడుదలైన రోజునే సూపర్ హిట్ అయిందంటూ తొలి కాల్ విజయవాడ నుంచి వచ్చిందనీ, అందుకే ట్రిపుల్ ప్లాటినం వేడుక విజయవాడలో జరపాలని నిశ్చయించామనీ చెప్పారు. కరెంట్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాతలు, ఆదరిస్తున్న ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు, మ్యూజికల్ హిట్ చేసిన దేవీశ్రీ ప్రసాద్ కు తన కృతజ్ఞతలని అన్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2- -3-
|