కొత్త హీరోయిన్ల రేసులో తొందరగానే గుర్తింపు తెచ్చుకున్న స్నేహ ఉల్లాల్ చిక్కుల్లో పడనుందా? అందుకు అవకాశాలు లేకపోలేదంటూ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. 'లక్కీ' చిత్రం ద్వారా బాలీవుడ్ కు పరిచయమైన స్నేహ ఉల్లాల్ ఆమధ్యన దర్శకుడు కరుణాకరన్ దృష్టిలో పడి 'ఉల్లాసంగా ఉత్సాహంగా' చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ చిత్రం సక్సెస్ కావడం, స్నేహలో ఐశ్వర్యారాయ్ పోలికలు ఉండటంతో ఆమెకు వరుస అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. మంచు మనోజ్ 'నేను మీకు తెలుసా' లో జలపాతాల మధ్య తడిసిన అందాలతో కనిపించిన స్నేహ మరిన్ని అవకాశాలు దక్కించుకుంది. ఈమధ్యనే నాగార్జున 'కింగ్'లోని ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించి ఎకాఎకిన నాగార్జున మేనల్లుడు సుశాంత్ సరసన 'కరెంట్' లో సోలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. కెరీర్ మంచి దశలో ఉన్న తరుణంలో ఇప్పుడు ఊహించని విధంగా ఆమె చిక్కుల్లో పడినట్టు సమాచారం.
'కరెంట్' చిత్రానికి ముందే ఓ నిర్మాత చిత్రానికి కమిట్ అయిన స్నేహ 16 లక్షల రూపాలు అడ్వాన్స్ గా కూడా తీసుకుందట. అయితే ఆ తర్వాత ఆ చిత్రంలో నటించకపోవడమే కాకుండా అడ్వాన్ కూడా తిరిగి ఇవ్వలేదట. దీంతో సదరు నిర్మాత తన అడ్వాన్స్ డబ్బులు తిరిగిమ్మని స్నేహ కు చెప్పినా ఫలితం కనబడ లేదట.దాంతో ఆయన స్నేహ ఉల్లాల్ పై నిర్మాతల మండలిలో ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం. దీనిపై స్నేహ సత్వరం స్పందించి సెటిల్ మెంట్ కు రాకుంటే ఆమెపై నిషేధం అనివార్యం కావచ్చని అంటున్నారు. ఇప్పుడిప్పుడే నాలుగు అవకాశాలు దక్కించుకుంటూ...ఇలాయానా వంటి స్టార్ హీరోయిన్ల డేట్లు దొరక్కపోతే నిర్మాతల ఛాయస్ గా స్నేహ ఎదుగుతున్న తరుణమిది. ఒకసారి బ్యాన్ పడితే కెరీర్ కు గండిపడినట్టే. మరి స్నేహ ఏమంటుందో?!