బెల్లంకొండ 'నాడోడిగల్'
బెల్లంకొండ సురేష్ ఇప్పుడు గట్స్ ఉన్న నిర్మాతగా ఒకేసారి వరుస ప్రాజెక్ట్ లతో తన సత్తాను చాటుకుంటున్నారు. ఆమధ్యన కొన్ని అనువాద చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సురేష్ తాజాగా 'రైడ్' చిత్రంతో మళ్లీ స్ట్రయిట్ చిత్రాల వైపు వచ్చారు. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం ఆయన రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. 'లక్ష్మీనరసింహా' చిత్రం తర్వాత మళ్లీ బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ చిత్రాన్ని ఇటీవల అనౌన్స్ చేసి పూజా కార్యక్రమాలు కూడా జరిపారు. భవిష్యత్ లో బాలకృష్ణతో మరో రెండు చిత్రాలు కూడా ఆయన ప్లానింగ్ లో ఉన్నాయి. తాజాగా ఆయన తమిళంలో విజయవంతమైన 'నాడోడిగల్' చిత్రం రీమేక్ హక్కులను గట్టి పోటీ మధ్య సొంతం చేసుకున్నారు.
శశికుమార్, విజయ్, భరణి, అనన్, నేహ తదితరులు ప్రధాన పాత్రధారులుగా సముతిరాకని దర్శకత్వంలో మైఖైల్ రాయప్పన్ 'నాడోడిగల్'చిత్రాన్ని తమిళంలో నిర్మించారు. ఇది చిన్న చిత్రంగా విడుదలై చాలా పెద్ద చిత్రంగా మారుతోంది. దక్షిణాదిలోనే కాకుండా, మలేసియాలో 6, సింగపూర్ లో 2, శ్రీలంకలో ఒక థియేటర్ లో ఈ చిత్రం విడుదలైంది కూడా. రోజురోజుకూ పెరుగుతున్న ప్రేక్షకాదరణతో మరికొన్ని కేంద్రాలలో కూడా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. ఈ తరుణంలో బెల్లంకొండ సురేష్ ఆ చిత్రం తెలుగు రైట్స్ ను దక్కించుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఓ ప్రముఖ మాస్ హీరోకి బెల్లంకొండ చూపించారనీ, ఆయన కూడా ఎంతో ఆసక్తి కనబరచారనీ తెలుస్తోంది. అన్నట్టు...రవితేజతో ఓ సినిమాకి బెల్లంకొండ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే కదా..
Be first to comment on this News / Article!
|