నాగచైతన్య-ఎన్టీఆర్ ఫైట్!
'జోష్'తో తొలి అడుగు వేయడానికి సిద్ధపడుతున్న నాగర్జున తనయుడు నాగచైతన్యకూ, యంగ్ స్టార్ ఇమేజ్ తో మంచి డిమాండ్ లో ఉన్న ఎన్టీఆర్ కూ మధ్య ఫైట్ ఏమిటని మరో లోతుగా ఆలోచించకండి. నాగచైతన్య ఎక్కడైతే ఫైట్లు చేశాడో అదే లొకేషన్ లో ఎన్టీఆర్ ఇప్పుడు ల్యాండ్ అయి యాక్షన్ ఎపిసోడ్లలో పాల్గొంటున్నారు. ఒకే ప్లేస్ లో రెండు సినిమాలకు చెందిన ఫైట్లు ఒకరోజు తేడాతో షూట్ చేయడమే ఇక్కడ అసలైన విశేషం.
దిల్ రాజు నిర్మాతగా వాసు వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'జోష్' చిత్రంలోని ఓ కీలకమైన యాక్షన్ సన్నివేశాన్ని మెహదీపట్నంలోని ఎన్టీఆర్ నివాసానికి ఎదురుగా ఇటీవల చిత్రీకరించారు. ఆ మరుసటి రోజే సరిగ్గా అదే లొకేషన్ లో వినాయక్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'అదుర్స్' (వర్కింగ్ టైటిల్) కోసం కొన్ని యాక్షన్ దృశ్యాలను చిత్రీకరించారు. ఇలా ఒకే ప్లేస్ లో రెండు చిత్రాల ఫైటింగ్ షెడ్యూల్స్ జరగడం యాదృచ్ఛికం కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొద్దిపాటి గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ ఈనెల 1వ తేదీ నుంచి 'అదుర్స్' షూటింగ్ లో పాల్గొంటున్నారు. నయనతార, షీలా కథానాయికలుగా నటిస్తున్నారు. నివరధిక షెడ్యూల్ తో సినిమా పూర్తి చేసి అక్టోబర్ 14న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు చిత్ర సమర్పకుడు కొడాలి నాని, నిర్మాత వల్లభనేని వంశీ చెబుతున్నారు. ఇక నాగచైతన్య సరసన సీనియర్ నటి రాధిక కుమార్తె కార్తిక హీరోయిన్ గా నటిస్తున్న 'జోష్' చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|