కృష్ణవంశీ-రవితేజ 'కందిరీగ'
'సింధూరం', 'ఖడ్గం' చిత్రాల తర్వాత కృష్ణవంశీ-రవితేజ కాంబినేషన్ ను కలుపుతూ బెల్లంకొండ సురేష్ నిర్మించ తలపెట్టిన కొత్త చిత్రం
ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. 'మహాత్మ' చిత్రం తర్వాత కృష్ణవంశీ దర్శకత్వం వహించనున్న సినిమా ఇది కావడం విశేషం. కృష్ణవంశీ సైతం తన తదుపరి చిత్రం రవితేజతో ఉండబోతోందంటూ తన తాజా ఇంటర్వ్యూలో వివరించారు. ఇందులో శ్రీకృష్ణదేవరాయలు ముని మనువడుగా రవితేజ నటించబోతున్నారు. ఈ చిత్రానికి 'కందిరీగ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
రవితేజకు 'సింధూరం' చిత్రంతో సరైన బ్రేక్ ఇచ్చిన క్రెడిట్ కృష్ణవంశీకి దక్కుతుంది. ఆ తర్వాత కూడా కృష్ణవంశీ 'ఖడ్గం'లో రవితేజ నటించారు. ముచ్చటగా మూడోసారి ఆ కాంబినేషన్ ను కలుపుతూ బెల్లంకొండ సురేష్ ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే కృష్ణవంశీ 'మహాత్మ' చిత్రం షూటింగ్ లో ఉన్నందున రవితేజతోనే మరో చిత్రాన్ని బెల్లంకొండ ప్రారంభించారు. తమిళ 'నాడోడిగళ్' ఆధారంగా సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రానికి 'శంభో శివ శంభో' అనే టైటిల్ కూడా ఖరారైంది. దీని తర్వాత ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించనున్న 'డాన్ శీను'కు కూడా రవితేజ కమిట్ అయ్యారు. కాగా, కృష్ణవంశీ-రవితేజ 'కందిరీగ' చిత్రం నవంబర్ నుంచి రెగ్యులర్ షెడ్యూల్ కు రానుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది.
Be first to comment on this News / Article!
|