'జయీభవ' 23న
'అతనొక్కడే', 'హరేరామ్' వంటి హిట్ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ కథానాయకుడుగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'జయీభవ'. కల్యాణ్ రామ్ జోడిగా హన్సిక నటించింది. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ విడుదలకు సిద్ధమవుతోంది. ఈనెల 23న సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు కల్యాణ్ రామ్ తెలిపారు.
'జయీభవ' ఆడియోకి మంచి స్పందన వచ్చిందనీ, థమన్ ఎస్ సంగీతాన్ని అందించిన ఈ ఆడియోను హిట్ చేసిన అందరికీ తన కృతజ్ఞతలనీ ఆయన అన్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ గతంలో తాను నటిస్తూ నిర్మించిన రెండు చిత్రాల తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా ఆదరించి అఖండ విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. తమ బ్యానర్ కు ఇది ఒక మంచి చిత్రం అవుతుందన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, ఆలీ, రఘుబాబు, వేణుమాధవ్, చలపతిరావు, సుధ, హేమ, బెనర్జీ, వకీల్ ఖాన్ తదిరులు నటించారు. ఈ చిత్రానికి బివిఎస్ రవి కథ-మాటలు, దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ, విజయ్ ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్, రాజీవ్ నాయర్ ఆర్ట్ అందించారు. మాస్టర్ నందమూరి శౌర్యారామ్ సమర్పకుడుగా వ్యవహరించారు.
Be first to comment on this News / Article!
|