|
|
Articles: TP Features | `మెగా'కు కోటరీయే దగా - Site Administrator
| |
ఏ ముహూర్తాన మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి అడుగుపెట్టారో గాని... పాపం అడుగడుగునా అపశకునాలే. పార్టీ పెట్టిన వేళావిశేషం ఎలాంటిదో గాని ఆది నుంచీ కోవర్టుల కుట్రలే. ఎన్నికల్లో ఘోర పరాజయం ప్రజారాజ్యం పార్టీ మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చేసింది. వెండితెర వేల్పుగా జనం జేజేలు అందుకున్న చిరంజీవి... సీనియర్లు... అనుభవజ్ఞులు తనకు మార్గదర్శకులౌతారని, పార్టీకి దిశానిర్దేశం చేస్తారని ఆశించారు. రాజకీయాల్లో తలలు పండిన, కాకలు తీరిన యోధులుగా కీర్తిని గడించిన పెద్దలకు పెద్ద పీట వేశారు. కాని చిరంజీవికి ఎన్నికల యేరు దాటటం చేతకాకపోయే సరికి ఈ పెద్దలే తెప్పలు తగలేయడం మొదలు పెట్టారు. చిరంజీవి పార్టీ పెట్టక ముందే చిరంజీవి పార్టీ పేరుతో ఆంధ్రదేశంలో ఎక్కువ ప్రచారం పొందిన కొందరైతే ముఖాలే చాటేశారు. పార్టీని వదిలి దాటేశారు.
పోనీ, పోయినోళ్ళందరూ మంచోళ్లేనని అనుకుంటే ఇప్పుడూ చిరంజీవిని వదలడం లేదు. పీఆర్పీ దాని పుట్టుపూర్వోత్తరాలు, చిరంజీవిపై కోటరీల లాటరీలు అంటూ మైళ్ళ కొద్దీ రీళ్ళ కథలను వినిపిస్తున్నారు. మెగా పదవిపై కన్నేసి, మెగా హంగుతో, మెగా ఆర్భాటంతో, మెగా ప్రచారంతో వీరకదం తొక్కిన మెగాస్టార్ దగా పడ్డ వైనం వెనుక ఉన్న జూబ్లీహిల్స్ రహస్యాల్ని విప్పి చెప్పుతున్నారు. ప్రజారాజ్యం విషవృక్ష కావ్యాన్ని శాంతరసంతో పరకాల ప్రభాకర్ శ్రవణానందంగా వినిపిస్తే... అసలు చిరంజీవి రాజకీయాలకే పనికి రాడని... ఆయన రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే మరో నలభై యేళ్ళయినా సరిపోవని ఆరునొక్క శృతిలో గొంతు విప్పారు... చిరంజీవికి నిన్నటి రాజకీయ గుగ్గురువు కేయస్సార్ మూర్తి. చెప్పా పెట్టకుండా ప్రజారాజ్యానికి దూరంగా వెళ్ళిపోయిన మూర్తి అకస్మాత్తుగా మీడియా ముందుకు వచ్చారు.
ప్రజారాజ్యం వ్యవస్థాపక నేతల్లో ఒకరయిన సీనియర్ దళిత నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు కెఎస్ఆర్ మూర్తి మాటల్లో ‘చిరంజీవికి రాజకీయ పరిపక్వత లేదు. ఆయన ఇంకా నాయకుడిగా ఎదగలేదు. పార్టీ పరిస్థితి అమ్యగోచరంగా ఉంది. చిరంజీవిలో మార్పు రానంతవరకూ ఈ పార్టీ ముందుకుపోవడం కష్టం’. అంతేనా ఆయన వెల్లడించిన కష్టమైన సత్యాలలో `ఒక్క అల్లు అరవిందునే అని లాభం లేదు. కన్నబాబు, జికె, కుమార్, విక్రం లాంటి కోటరీ ఉంది. వాళ్ల వల్లే పార్టీ మునిగిపోయింది. ఈ పరిస్థితిలో పార్టీ కోలుకోవడం చాలా కష్టం. సామాజికన్యాయ నినాదం ప్రజల్లోకి వెళ్లకపోగా, కాపు ముద్రతో నష్టపోయాం. దాన్ని పోగొట్టే ప్రయత్నం చేయడం లేదు' లాంటి వ్యాఖ్యలూ ఉన్నాయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|