|
|
Articles: TP Features | మార్పంటే ఇదే! - Site Administrator
| |
(జమ్మి కోనేటిరావు)
వాళ్ళంతా 36 మంది. రాజస్థాన్లో అశుద్ధాన్ని తీసివేసి మరుగుదొడ్లు శుభ్రపరిచే స్త్రీలు వారు! సాక్షాత్తు అమెరికాలో యు.ఎన్. మిల్లిన్నియమ్ ప్లాజా హోటల్ లో విడిది చేసి, ఆకాశహర్మ్యాలు, మన్ హాటల్ లోని బ్యాటరీ పార్కు ఇంకా అనేక విశేషాలు చూశారు వారు. మరింత వెనక్కి వెళ్లి విశేషాలు తెలుసుకొందాం.
సునీతానందా. వయస్సు 33 సంవత్సరాలు. రాజస్థాన్, ఆల్వార్ నగరవాసి. అమెరికాలో ఆమె అనుభవం స్వర్గలోకాన్ని తలపింప చేసింది. సూపర్ మోడల్స్ తో పాటు విహారం చేసింది. ర్యాంప్ మీద నడిచింది. అది అంతర్జాతీయ పరిశుభ్రతా వాతావరణ వత్సరం, 2008. ఆమె తన అనుభవాలు చెబుతూ ఉంటే పిల్లల ఆనందానికి అవధులు లేవు. ఆ స్టార్ హోటల్ లో దేశాధినేతలు, రాజకీయవేత్తలు దేశదేశాల నుంచి వచ్చి విడిదిచేస్తూ ఉంటారు. సునీత, ఆమెతో బాటు 35 మంది వారితో బాటే ఉన్నారు. సరే, వారికి వీరికి సంబంధం అంతమాత్రమే.
మరొక్క ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. సునీత మరుగుదొడ్లని శుభ్రపరుస్తూ మలపదార్ధాన్ని తట్టల్లోకి నింపి, నెత్తి మీద ఎత్తుకొని మోసుకొనిపోయి పారేసేది. వివాహం ద్వారా కూడా ఆమె అలాంటి కుటుంబానికే చేరుకొంది. వెంటనే ఆ 'కులవృత్తి'లోకే ప్రవేశించింది. ఎంత వద్దనుకొన్నా కుటుంబానికి అదే ఆదాయం, ఆధారం. అత్తగారితో కలిసి కేవలం నెలకి రూ.400 ఆదాయం.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|