|
|
Articles: TP Features | ఓంకారమయం సైన్స్! - Dr. Subrahmanyam Vangala
| |
అవి దేవీ నవరాత్రుల రోజులు. విశాఖపట్నం నగరం చాలా హడావుడిగా ఉంది. వీధి వీధికీ జనాలు నవరాత్రుల వేడుకలు చాలా హడావుడిగా చేసుకుంటున్నారు. నేను అలా చిన్నవాల్తేరు ఇంటి నుంచి సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ పాండురంగస్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకుని ఇంటికి తిరుగుముఖం పట్టాను. ఈసారి అలా పెద్దవాల్తేరు వేపు నడుస్తూ ఉంటే 'ఓంకార నాదానుసంధానమౌ గానమే శంకరాభారణమూ' అని గట్టిగా వినిపిస్తోంది. బాలసుబ్రహ్మణ్యం శంకరాభరణం సినిమా ద్వారా సర్వతోముఖ ప్రజ్ఞ గల గాయకుడిగా స్థిరపడిపోయారు. ముప్పయి ఏళ్ల క్రితం నాటి పాటలు ఇప్పుడు కూడా ఆంధ్రదేశం నలుమూలలా వినిపిస్తున్నాయంటే ఆ పాటలు దాసిన వాళ్ల, పాడిన వాళ్ల కళాచాతుర్యాన్ని మెచ్చుకోవాలి.
ఇంకాసేపు నడిచిన తరువాత ఇంటికి చేరుకుని, భోజనం చేసి, సోఫా మీద వాలి దీర్ఘాలోచనలో పడిపోయాను. పక్క గదిలో, టివిలో పాటలు వినిపిస్తున్నాయి. నాకు ఇష్టమైన ఘంటసాల పాట 'దేవుడనే వాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం' అని వినిపించేసరికి పక్క గదిలోకి వెళ్లాను. పాట విన్న తరువాత ఇంకొక ఛానల్ లో భక్త ప్రహ్లాద సినిమా వస్తూంటే చూడడంలో నిమగ్నమైపోయాను.
పది నుమిషాల తరువాత హిరణ్య కశిపుడు తన తనయుడిని 'నీ దేవుడెక్కడ ఉన్నాడు?' అని ప్రశ్నించేసరికి, ప్రహ్లాదుడు 'ఇందుగలడు అందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసిన అందందే కలడు, దానవాగ్రణి వింటే' అని ఒక శ్లోకం వినిపించాడు. సినిమా అయిపోయిన తరవాత పాటల కార్యక్రమం మొదలయ్యింది.
నేను నా లాప్టాప్ (laptop) ఓపెన్ చేసి 'బయోమార్కర్స్ అండ్ మేటాబోనోమిక్స్' అనే ఆర్టికల్ రాయటం మొదలు పెట్టాను. కానీ, బాల సుబ్రహ్మణ్యం ఇంకొక మధుర గానం 'అణువూ అణువున వెలసిన దేవా, కనువెలుగయి మమ్ము నడిపించరావా' అని వినిపించేసరికి, ధ్యానం కుదరక లాప్టాప్ మడిచేసి మళ్ళీ దీర్ఘాలోచనలో పడిపోయాను.
| Read 31 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|