|
|
Articles: Poetry | తడి ఆరని చెమట - Dr. Raghotham Reddy Pinninti
| |
ఇంట్లో చెత్తని
అందరూ నడిచే
రోడ్డు మీద వేయడంతో
మొదలయ్యే మన స్వార్థం
కుప్పలు కుప్పలుగా
మన చుట్టూ పేరుకు పోవడాన్ని
ఎప్పుడయినా గమనించారా...
ఎలుగు బంటులు
లంచ గొండులు
మన ఇళ్లల్లోంచే... దర్జాగా వెళ్ళడం
కోట్లు కోట్లు కూడబెట్టడం
సిగ్గు లేకుండా ఖరీదైన
జీవితాలు వెలగబెట్టడం
ఈ వెలుగుల వెనుక
నిజాయితీ ఎంతో
ఆలోంచించారా? ఎప్పుడయినా
లంచం అనే మురుగుకుంటలో
దొర్లుతున్న... మదమెక్కిన పందులలో
నాన్నలు
అన్నలు
తమ్ముళ్ళు
అక్కడక్కడ... సిగ్గు సిగ్గుపడేలా
అమ్మలు... మనవాళ్ళే
ఉండటాన్ని... గమనించారా?
లంచం తీసుకుని...
బతుకులను బలితీసుకొనే
రాక్షసుల... ఇళ్లల్లో
ఏమీ తెలియనట్టు...
రాణుల్లా... రాజుల్లా...
భోగం అనుభవిస్తున్నామనే
నిజాన్ని... గమనించారా ఎప్పుడయినా?
మన రాజ భవనపు పునాదుల్లో
కుప్పలు కుప్పలుగా పేర్చబడిన ఎముకలు ఎవ్వరివో
మన ఇంట్లో పేరుకుపోయిన నోట్లకట్టల పైన
తడి ఆరని చెమట చుక్కలు ఎవరివో
తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
కనీసం మనమయినా మనుషుల్లా
బ్రతకడం అలవాటు చేసుకుందాం...
మార్చవలసింది మనమే
మారవలసిందీ మనమే
మనుగడ చేయవలసిందీ మనమే...
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|