|
|
Articles: TP Features | ఉతికి ఆరేయండి! - Site Administrator
| |
అమెరికా వాసులు ఇళ్ళల్లో పాటించే అలవాట్లు, వినియోగిస్తున్న పరికరాల్లో స్వల్పమైన మార్పులు చేసుకుంటే సంవత్సరానికి కోటీ 23 లక్షల టన్నుల కాలుష్యాన్ని నివారించవచ్చని ఈ పరిశోధకులు చెబుతున్నారు. అంటే అమెరికాలో మొత్తం విడదల అయ్యే కాలుష్యంలో ఏడు శాతం అన్న మాట. చైనా తరువాత అమెరికాలోనే ఈ విషవాయువుల విడుదల ఎక్కువ. పాశ్చాత్య దేశాల వారు తమ ఇళ్ళల్లోని జీవన అలవాట్లలో భారతీయులను అనుకరిస్తే ముఖ్యంగా విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిపోతుందని వీరి పరిశోధనలో బయటపడింది. ఉదాహరణకు బట్టలు ఎండలో ఆరబెడితే అయ్యే ఖర్చు ఏమీ లేదు. అదే అమెరికాలో బట్టలను ఆరబెట్టుకోడానికి విద్యుత్ తో పనిచేసే డ్రైయర్లను వినియోగిస్తారు. అలానే వాహనాలను నడిపే విధానంలో కూడా భారతీయుల పద్ధతిని పాటించాలని వారు సూచించారు.
దైనందిన జీవితంలో సౌకర్యాలను త్యాగం చేయక్కర లేకుండానే చిన్న చిన్న అలవాట్ల మార్పుతో ఇళ్ళల్లోంచి వెలువడే వ్యర్ధ వాయువులను చాలా వేగంగా తగ్గించుకోవచ్చు. ఈ పరిశోధనలను అమెరికా జాతీయ సైన్స్ అకాడమీ పత్రికలో ప్రకటించారు. గృహస్థులు తమ చిట్కాలను పాటిస్తే పదేళ్ళలోపులోనే చెప్పుకోదగ్గ స్థాయిలో ఈ వాయువుల విడుదలను అరికట్టవచ్చునని వివరించారు. ఈ లోగా పర్యావరణానికి తక్కువ హాని కలిగించే యంత్రాలు, వినియోగించిన శక్తినే తిరిగి ఉపయోగించుకోగలిగే పరికరాలు అభివృద్ధి అవుతాయని తెలిపారు. పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించడానికి ఎలాంటి అధునాతన పద్ధతులను ఆచరిస్తున్నామో, దానిని అమలు చేయడాన్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నామో అదే శ్రద్ధను ఇళ్ళపై పెడితే తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనం సాధించవచ్చునని తెలిపారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|