|
|
Articles: TP Features | ఉతికి ఆరేయండి! - Site Administrator
| |
వాహనాలను నడపడంలో మరింత నైపుణ్యం, గదులను వేడి చేసుకునే హీటర్లను కొద్దిగా తగ్గించడం, బట్టలను ఎండలో ఆరవేయడం వంటి ఎలాంటి ఖర్చూ లేని, తక్కువ ప్రయత్నంతోనే అమలు చేయగల ఈ చిట్కాలు వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలు కూడా కలిగిస్తాయని వారు సలహా ఇచ్చారు. కనీసం ఏడాదిలో ఐదు నెలలైనా అమెరికా వాసులు తమ బట్టలను ఎండలో ఆరేసుకోవాలని వారు సలహా ఇస్తున్నారు. కేవలం 8 శాతం అమెరికా గృహస్థులు మాత్రమే తమ బట్టలను బయట ఆరవేస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ ఇంటి యజమానులు విధించే నిబంధనల వలన లక్షలాది మంది బట్టలను డ్రైయర్లలోనే ఆరబెడుతున్నారని సర్వేలో తేలింది. అలానే చాలా మంది అమెరికన్లు తమ వాహనాలు ఆగి ఉన్నప్పుడు కూడా ఇంజన్లను ఆన్ చేసి ఉంచుతారని, ఈ అలవాటును మాన్పించగలిగితే కొన్నికోట్ల టన్నుల కర్బన్ వాయువు వాతావరణంలో కలవకుండా ఆపవచ్చని చెప్పారు.
ఇంటిలో పాత విద్యుత్ గృహోపకరణాలను మార్చుకోవడం కూడా మంచిదని పేర్కొన్నారు. పెద్ద తెరల ప్లాస్మా టీవీల స్థానంలో ఎల్ సీడీలు, బాత్ రూమ్ లలో అలానే తక్కువ నీటిని చల్లే షవర్ హెడ్ లు వినియోగిస్తే విద్యుత్ ను గణనీయంగా ఆదా చేసుకోవచ్చన్నారు. భారత్ లో విద్యుత్ గృహోపకరణాల వినియోగం వల్ల కేవలం 8 శాతం హానికలిగించే వాయువులు మాత్రమే వాతావరణంలో కలుస్తున్నాయని, దీనికి భారతీయుల దైనందిన జీవన అలవాట్లే కారణమని పేర్కొన్నారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
![](../images/spacer.gif) |
Advertisements |
|
![](../images/spacer.gif) |
![](../images/spacer.gif) |
Advertisements |
|