TeluguPeople
  are the trend-setters

 
Articles: Drama
మానవతా మందిరం-2
- Mr. kompellaramakrishna murty
< < Previous   Page: 3 of 4   Next > >  
(సంగీత రూపకం - మూడవభాగం) కాలం : అరుగో మానవాళికి మహత్తర సందేశాలిచ్చిన ఆ మహనీయులను దర్శించండి (దృశ్యం: గీతోపదేశం చేస్తున్న కృష్ణుడు) రాము, రాణీ : అడుగో! అడుగో! కృష్ణుడు సమతా గీతా బోధకుడు అధర్మ మార్గం నిరసించాడు ధర్మ విజయమే సాధించాడు /అడుగో/ రహమాన్ : పవిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ, సంభవామి యుగేయుగే (దృశ్యం: బోధివృక్షం నీడలో గౌతమ బుద్ధుడు) మోహన్, రోజీ: ఇతడే గౌతమ బుద్ధుడు శాక్యవంశ ముని చంద్రుడు ధర్మచక్రమును త్రిప్పాడు త్రిశరణములు ప్రవచించాడు మోసెస్, రాణీ : బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి (దృశ్యం:సిలువ మోస్తూ ఏసుక్రీస్తు) రాము, లక్ష్మీ : అతడేరా దయామయుడు ఏసుక్రీస్తు కరుణారస సింధువు, దీనజనుల బంధువు /అతడేరా/ పొరుగువాణ్ణి నీవలెనే ప్రేమించమన్నాడు క్షమాగుణం, ప్రేమధనం పెంచుకోమన్నాడు సిలువనెక్కి తన రక్తం ధారవోసి జగతికి శాంతిసందేశమిచ్చి శకపురుషుడు అయ్యాడు /అతడేరా /

Be first to comment on this Article!

< < Previous   Page: 3 of 4   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.