|
|
Articles: TP Features | హెడ్లీ చిన్నప్పట్నించీ అంతే! - Site Administrator
| |
కాని హెడ్లీ ఎవ్వరికీ ఆ విధంగా షాక్ కలిగించలేదు. అతని గురించి తెలిసినవారు అతను సరైనవాడు కాడనే చెబుతున్నారు. 'చాలా మందికి వారి జీవితాలలో ఒకదానికి మరొకదానికి పొంతనలేని అనుభవాలు ఎదురవుతుంటాయి. కాని వారు వాటికి సర్దుకుపోతుంటారు' అని అతని సమీప బంధువు, పెన్సిల్వేనియా నాటింగ్ హామ్ లో ఒక డేకేర్ సెంటర్ నిర్వహిస్తున్న విలియమ్ హెడ్లీ అన్నారు. 'కాని దావూద్ ఎన్నడూ అలా చేయడు. ఎడమ భాగంలో జరిగే విషయాలను కుడి భాగానికి తెలియనివ్వడు. అదే సమస్య' అని విలియమ్ హెడ్లీ పేర్కొన్నారు.
దావూద్ సయ్యద్ గిలానీ (హెడ్లీ) వాషింగ్టన్ లో జన్మించాడు. అతని తల్లిదండ్రులు వాషింగ్టన్ లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో పనిచేసేవారు. అతని తండ్రి సయ్యద్ సలీమ్ గిలానీ చురుకుదనం ఉన్న దౌత్యాధికారి అని, సంగీత శాస్త్ర ప్రవీణుడని, కవి అని, ఆయన రాయబార కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసేందుకు ఫిలడెల్ఫియా నుంచి వచ్చిన సెరిల్ హెడ్లీ మనస్సును చూరగొన్నారని ఆ కుటుంబ మిత్రులు చెప్పారు. 1960లో ఆ దంపతులు తమ పసికందు దావూద్ తో కలసి యుఎస్ నుంచి 'అమెరికా' అనే నౌకలో ఇంగ్లండ్ కు, అక్కడి నుంచి లాహోర్ కు వెళ్ళారు. అయితే, వారి వైవాహిక బంధం త్వరగానే విచ్ఛిన్నమైందని, సయ్యద్ సలీమ్ గిలానీ తన స్వదేశపు సంప్రదాయాలకు పూర్తిగా బద్ధుడైపోయినట్లు, ఆయన భార్య వాటికి తలొగ్గడానికి నిరాకరించినట్లు మిత్రులు తెలిపారు.
సయ్యద్ సలీమ్ గిలానీని, తన కుమారుని, కుమార్తె సయ్యెదాను వదలి సెరిల్ హెడ్లీ వెళ్ళిపోయిన తరువాత ఆమె జీవితం గురించి రకరకాల కథనాలు వినిపించాయని మిత్రులు చెప్పారు. తాను ఒక 'ఆఫ్ఘన్ యువరాజు'ను వివాహం చేసుకున్నానని, కాని ఆయన హతుడైన తరువాత తాను కాబూల్ నుంచి పారిపోవలసి వచ్చిందని ఎర్ర జుట్టున్న, ఆకుపచ్చ కళ్ళ సెరిల్ మిత్రులతో చెప్పింది. 1970 దశకం ఆరంభంలో ఆమె తిరిగి ఫిలడెల్ఫియా చేరుకున్నట్లు, వివిధ ఆఫీసు ఉద్యోగాలు చేసినట్లు, సంపన్నులతో డేటింగ్ చేసినట్లు, వారిలో ఒకరు ఒక పాత్ బార్ ను కొనేందుకు ఆమెకు డబ్బును అప్పుగా ఇచ్చినట్లు మిత్రులు తెలియజేశారు. ఆమె ఆ బార్ ను ఖైబర్ పాస్ గా మార్చి, ఆఫ్ఘన్ సాంప్రదాయక పెళ్ళి గుడారాలతో అలంకరించి ఆకర్షణీయమైన బీర్ లు నిల్వ చేసింది.
1977లో సైనిక తిరుగుబాటులో పాకిస్తాన్ ప్రభుత్వం పతనమైనప్పుడు సెరిల్ తన పిల్లల గురించి భయపడిందని మిత్రులు చెప్పారు. ఆమె పాకిస్తాన్ కు వెళ్ళి హసన్ అబ్దల్ కేడెట్ కాలేజీ చదువు నుంచి తన కుమారుని మానిపించి తనతో తీసుకువచ్చినట్లు వారు తెలిపారు. 'ది ఫిలడెల్ఫియా ఇంక్వైరర్' పత్రిక ఈ విషయాన్నిఒక వ్యాసంలో పేర్కొన్నది కూడా. (ఆమె కుమార్తె సయ్యెదా చాలా సంవత్సరాల పాటు తన తండ్రి వద్దే ఉండిపోయింది.)
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|