|
|
Articles: TP Features | సంఘానికే వైద్యం కావాలి - Site Administrator
| |
మనిషి ముఖ్యం :
బౌద్ధం చుట్టూ అనేక మూఢ విశ్వాసాలు అల్లుకున్నాయి. బౌద్ధంలో ఉన్న మానవ సంబంధాలు ప్రచారం కాలేదు. బుద్ధుడు భిక్షు సంఘంలో అందరూ సమానమే అన్నాడు. బుద్ధుడు తన సొంత బంధువులు, ఇతరులు అన్న తేడా చూపలేదు. ధర్మజ్ఞానంలో ప్రజ్ఞ గల వారికే ప్రాధాన్యం ఇచ్చాడు. తన ఏకైక కుమారుడు రాహుల్ ను అందరితో సమానంగా చూశాడు. (అదే పుస్తకం - 514 పేజి).
సమత్వం, సోదరత్వం, ఆదరణ, కరుణ, దయ, ప్రేమ, సత్సంబంధాలు, సౌహార్ద్రత అనే మాటలు మానవుల్లో అంతస్సంబంధాలను పెంచుతాయి. బౌద్ధం మానవ సంబంధాలను చిక్కుపరిచింది. నీకు పుట్టిన బిడ్డ ఎలాంటివాడో, మరొకరికి పుట్టిన బిడ్డ కూడా అలాంటివాడే. నీ బిడ్డలతో పాటు నీ ఇంటికి వచ్చిన వారిని ఆదరించు అనే భావన మీద 'తల్లితనం' విస్తరిస్తుంది. విసుగు, నిస్తేజం, నిరాశం, నిద్రాణం, నిర్వీర్యత, నీరవం వంటి మాటలు మనవోత్తేజాన్ని దెబ్బతీస్తున్నాయి. అవసరార్థం మాత్రమే మానవులతో సంబంధాలు పెట్టుకోవడం. అవసరం లేకుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనే స్వార్ధపూరిత బుద్ధికి తల్లితనం వ్యతిరిక్తమైంది. స్వార్ధం అంటే అర్ధాన్ని స్వాయత్తం చేసుకోవడమే. స్వార్ధం వల్ల మనిషి మనుష్యులను పోగొట్టుకుంటున్నాడు. అందరికంటే ప్రపంచంలో విలువైనవారు మనుష్యులు. మనిషిలో అన్ని గుణాలు నిక్షిప్తమై ఉంటాయి. ఏ గుణాన్ని ప్రేరణ చేస్తే ఆ గుణం మనకు దగ్గరవుతుంది. మనల్ని ఉత్తేజపరుస్తుంది. అది ఎంత పెద్ద వస్తువైనా దాని గుణం వరకే పరిమితం అవుతుంది. వజ్రాల ఆభరణం అది ధరించడానికే పనికివస్తుంది. అలాగే పెద్ద కరవాలం యుద్ధం చేయడానికే పనికివస్తుంది. అలాగే వస్తు గుణం ఒక్కటే ఉంటుంది. 'మనిషి'లో మానవ సంబంధింత గుణాలు ఉంటాయి. మానవుడు, మానవురాలు అన్ని వస్తువుల కంటే అన్ని జంతువుల కంటే గొప్పవారు. అందుకే 'మనిషి'ని పోగొట్టుకొంటున్నవారు తమ స్వార్ధపూరిత భావన నుండి బయటపడాల్సి ఉంది. ఒకడు కోట్లు గడించాడు. అతడికి దాహమయ్యింది. అతడు కదలలేడు. ఒక్క గ్లాసు మంచినీళ్ళు ఇచ్చే మనిషి కావాల్సి ఉంది. మనుష్యులను సేవకులుగా చూసేవారు సేవకులుగా వాడుకునేవారు మనుష్యుల ప్రేమ పొందలేరు. మనుష్యులను సమానంగా చూటంలోనే వారి సాహచర్యం లభిస్తుంది.
మానసిక, శారీరక, సామాజిక ఆరోగ్యం :
భారతీయ కుటుంబ వ్యవస్థలో సాహచర్య భావం లోపించడం పట్ల మానసిక శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. బౌద్ధాన్ని ఒక మానసిక తత్వంగా భారతీయ కుటుంబాలకు అందించవలసి ఉంది.
భారతీయ కుటుంబాల్లో తల్లుల అతి ప్రేమలు అభద్రతకు కారణం అవుతున్నాయి. బిడ్డను ప్రేమించడంలో అతి ప్రదర్శన వల్ల బిడ్డకు, ఎండ, వాన, సుఖం, దు:ఖం తెలియకుండాపోతున్నాయి. ఒక్కసారి బిడ్డ ప్రపంచంలో అడుగుపెట్టాక వాడు లేక ఆమె ప్రపంచ మానవుడు అవ్వాలనే దృక్పథం తల్లికి రావలసి ఉంది. తన పళ్ళు తోముకోవడానికి బ్రష్ మీద మరొకరు ఫేస్ట్ వేసి ఇవ్వడం, వారి భోజనాన్ని ఒకరు నోటికందించడం ఇవ్వన్నీ ప్రేమకు బదులు సోమరితనాన్ని నేర్పుతున్నాయి. బిడ్డలను ప్రకృతిని ఎదిరించి పోరాడే ఒక సైనికునిగా పెంచడంలోనే ప్రేమ ఉంది. తాను మరణించిన తరువాత తన బిడ్డ ఈ ప్రపంచంలో నిలబడి తనకు తాను బ్రతికి ఇతరులకు కూడా తన తల్లి, తనకు పంచిన ప్రేమను పంచగలగాల్సి ఉంది. అందుకే కుటుంబ స్త్రీలలో విశ్వజనీన భావం అవసరం. ప్రేమను దోసిళ్ళబెట్టి ప్రపంచానికి అందివ్వగలిగిన విశాలత్వ భావనే జ్ఞానవీచిక. రెలిజియన్ ఆఫ్ ది మోడరన్ బుద్ధిజంలో లక్ష్మీనర్సు బౌద్ధం మానసిక, శారీరక, సామాజిక ఆరోగ్యాన్ని అందిస్తుంది అన్నారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|