|
|
Articles: TP Features | భాషా ప్రాచీనత: కొత్త కోణాలు - Site Administrator
| |
పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ ప్రాంతంలో 'హుంజా' అనే స్థావరం ఉందనీ, అక్కడ బురుషస్ (BURUSHOS) అనే భాష మాట్లాడే బురుషస్కీ ప్రజలు కొద్ది సంఖ్యలో ఉన్నారనీ, ఈ బురుషస్కీ భాష గురించి బెర్నార్డ్ సార్జెంట్ మైకేల్ విజ్జెల్ ఇద్దరూ పేర్కొన్నారు. సింధు సరస్వతీ తీరాలలో ద్రవిడులు సింధునాగరికత ఉన్న పూర్వకాలం నుంచే నివసించారనీ, వారి ఆనాటి ఉనికి బ్రాహుయి, కురుఖ్, ఋరుషస్ రూపాలలో అక్కడక్కడా సాక్ష్యాలుగా కన్పిస్తున్నాయనీ అర్థం అవుతోంది. అదేకాలంలో ఋగ్వేద ఆర్యులతో సమీప వర్తిత్వం, సహజీవనం, స్నేహమో శతృత్వమో నెరపిన ద్రవిడుల ప్రభావంతో కొన్ని ద్రవిడ భాషాపదాలు ఋగ్వేదంలో చేరడంలో ఆశ్చర్యం లేదు.
ఋగ్వేద ఆర్యులతో ద్రవిడ భాషా సంపర్కం సింధు సరస్వతి తీరంలోనే కాదు ఇరాన్ లో కూడా జరిగే అవకాశం ఉంది. 'అవెస్తా' రూపొందే నాటికి పూర్వం ఇండో ఇరానియన్లు ఋగ్వేద ఆర్యులుగా (ఇండో ఆర్యన్లు) రూపొందడానికన్న ముందునాటి ఇరాన్ లో 'ఇలమ్' అనే భాష మాట్లాడే ప్రజలు నివసించారు. వాళ్ళని ఇలమైట్లు అంటారు. ఈ ఇలమ్ భాష ద్రవిడ భాషకు పూర్వరూపం కావచ్చునని వాక్రావ్ బ్లాజెక్ లాంటి పరిశోధకులు అనేక నిరూపకాలను అందించారు.
ద్రవిడియన్ల పుట్టిల్లు ఏది? :
ఆఫ్రికా ఖండంలో సుడాన్ నుండి సెన్ గల్ దాకా ఉన్న ప్రాంతాన్ని సాహెవ్ తీరం అంటారు. సాహెవ్ బెల్ట్ లో ఎన్నో ఆఫ్రికన్ భాషలు మాట్లాడే ప్రజలు జీవిస్తున్నారు. ఈ భాషల్లో ద్రవిడ మూలాలు కన్పిస్తున్నాయనేది చరిత్రవేత్తలు ఎక్కువగా దృష్టిపెట్టి పరిశోధిస్తున్న విషయం. ఫిన్నిష్ హంగేరియన్ భాషలలో కూడా ఇలానే కన్పిస్తున్నాయంటారు.
ద్రవిడయన్లకు ఆఫ్రికా ఖండమే పుట్టిల్లు కావచ్చనీ, నేటికి 10,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం ప్రారంభం అయిన కాలంలో కొత్త రాతి యుగం మొగ్గతొడుగుతున్న కాలంలో తొలి ద్రవిడియన్లు సుడాన్ నుంచి ఇరాన్ వైపు వలస మొదలుపెట్టారంటాడు బెర్నార్డ్ సార్జెంట్. ఇరాన్ లోంచి ఉత్తరాన ఉరవ్ పర్వతశ్రేణుల వైపు కొందరు ద్రవిడయన్లు, భారత ఉపఖండంవైపు కొందరు ద్రవిడియన్లు వలస సాగించారనేది బెర్నార్డ్ సార్జెంట్ ప్రతిపాదన. ఒక దశలో సెంట్రల్ ఆసియా అంతా ద్రవిడులే విస్తరించి ఉన్నారని క్లయిడ్ అహ్మద్ వింటర్స్ పేర్కొన్నాడు. సెంట్రల్ ఆసియా అంతా ఆనాడు విస్తరించింది. 'ప్రోటో నార్త్ ద్రవిడియన్ భాష' అంటాడాయన.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|