|
|
Articles: TP Features | క్షమించు యాదయ్యా.. - Site Administrator
| |
యాదయ్య ఎందుకు ఆత్మహత్యకు ఒడిగట్టాడు? :
యాదయ్యకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. కెసిఆర్, సబిత, చంద్రబాబు తదితరులతో యాదయ్య దిగిన ఫొటోలు ఆ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఆ ఫొటోలను, మార్కుల మెమోలను ఆయన గుర్తుగా ఆత్మహత్యా స్థలంలో వదిలాడు. తెలంగాణ విషయంలో రాజకీయ వాదులు చేసిన, చేస్తున్న మోసాలు యాదయ్యకు అర్థమై ఉంటాయి. మిత్రులందరితో కలిసి 'ఛలో అసెంబ్లీ' కార్యక్రమానికి వెళ్దామని చెప్పిన యాదయ్య ఆ రోజు ఉదయం ఒక్కడే బయలుదేరి వచ్చాడు. ఆ ముందు రోజు రాత్రి కెసిఆర్ లాంటి నాయకులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం వద్దని విద్యార్థులను నిరుత్సాహపర్చిన సంగతి తెలిసి ఉంటుంది. ఎబివిపి, బిజెపి నాయకులందరూ ఎవరికి వీలయిన రీతిలో వారు మాట్లాడటం వల్ల తీవ్ర నిరుత్సాహానికి, నిరాశకు గురయినందునే యాదయ్య ఆత్మహత్యకు ఒడిగట్టాడు. తెలంగాణ రాదనే నిరాశనే యాదయ్యను ఆత్మహత్యా యత్నానికి పురికొల్పింది. రాజకీయాలపై అంతో ఇంతో అవగాహన ఉన్న యాదయ్య నిరాశతోనే ఆత్మహత్య చేసుకున్నాడు. యాదయ్యను, యాదయ్య తరాన్ని చావనిచ్చి, చంపి తెలంగాణను తాత్కాలికంగా ఆపినా ముందు తరం వారు కూడా యాదయ్యలా చస్తారని చెప్పడానికి ఆస్కారం లేదు. యాదయ్య వెనక ఉన్నా ఈ తరం వారు ఇంకో రకంగా రియాక్ట్ కారని చెప్పడానికి ఎంతమాత్రం వీలు లేదు.
ఇక యాదయ్య గ్రామం సిరిపురానికి మూడే దారులున్నాయి. ఇందులో రెండు దారులు తారురోడ్డువి. ఈ రెండు దారులను పోలీసులు మూసేశారు. ఆబిడ్స్ లో ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వాడే బారికేడ్లతో సిరిపురం రోడ్లను పోలీసులు మూసేశారు. ఈ బారికేడ్లు సిరిపురానికి ఎలా వెళ్ళాయి? ఊరి నిండా పోలీసులు నిండారు. టీ షర్టులు వేసుకొన్న 20 - 25 ఏళ్ళ వయసున్న పోలీసులు, కర్ణాటక పోలీసులు, సీమాంధ్ర పోలీసులు ఆ ఊరిని స్వాధీనం చేసుకొని, యాదయ్య బంధువులను అదిలించి, బెదిరించి శవాన్ని హడావిడిగా బొంద పెట్టేశారు. మీడియా వారిని కూడా వెళ్ళనివ్వలేదు. వెళ్ళిన ఒకరిద్దరు కెమెరాల వారిని అదుపుచేసి బొంద పెట్టే వార్తా దృశ్యాలను అదుపుచేసి ఉంటారు లేదా పోలీసు వారికి ఇబ్బంది లేని విధంగా చిత్రీకరించుకోనిచ్చి ఉంటారు. విమర్శకులకు సమాధానం చెప్పడానికి అన్నట్లు గద్దర్, హరీష్, తీగల కృష్ణారెడ్డి లాంటి వారిని ముగ్గురిని అనుమతించారు. పోలీసులు ఇంత దుర్మార్గం ఎందుకు చేస్తున్నారు? క్రింది పోలీసులు వారంతట వారుగా ఇలాంటి పనులు చేయరు. వారికి ఇలాంటి ఆదేశాలు ఇస్తున్న వారెవరు? ఈ ఆదేశాలు ఇస్తున్నవారిని ప్రోత్సహిస్తున్న వారెవరు?
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|