|
|
Articles: My Thoughts | మాట పదిలమే అమ్మడూ! - Site Administrator
| |
ప్రతివాళ్ళు తామున్న పరిధిలో తాము గౌరవింపబడాలని కోరుకొంటారు. చిన్న పని నుండి పెద్దపని చేసేవారు సైతం. పనిమనిషికి డబ్బిచ్చి చేయించుకొంటున్నామని ఎలాబడితే అలా మాట్లాడితే ఊరుకొంటుందా! నోరు దగ్గర బెట్టుకొని మాట్లాడమని హెచ్చరిస్తుంది. అధికారి అయినంతమాత్రాన అడ్డదిడ్డంగా మాట్లాడితే కిందివాళ్ళు 'మా ఆత్మగౌరవం మాకుంటుంది' అని గుర్తుచేస్తున్నారు. మనం ముఖ్యంగా పబ్లిక్ ప్లేసుల్లోను, బ్యాంకులు, పోస్టాఫీసులు, రైల్వేల్లోను ఏమని కోరుకుంటాం! మర్యాదగా మాట్లాడుతున్నారా! లేదా అని చూస్తాం! మాట్లాడకుంటే అంత 'పొగరేమిటి జీతం తీసుకొనే కదా పనిచేస్తున్నాడు. సమాధానం చెప్పడానికి అంత బద్దకమా! అనుకొంటుంటాం. విసుక్కొంటూ సమాధానం చెప్పే ఏ ఒక్కరూ గౌరవం పొందలేరు.
భార్యాభర్తల మధ్య కూడా మాట్లాడేతీరులో ఆప్యాయత, మన్నన లేకుంటే చాలా అనర్థాలకు దోవతీస్తుంది. భార్యతో మాట్లాడేటప్పుడు ఓ స్నేహితురాలిలాగానో, సహచరి లాగానో కాకుండా బానిసల్లా మాట్లాడేవారు ఉన్నారు'. 'ఏమేవ్ - ఏయ్ - ఓయ్' అని అదిలిస్తూ అధికారికంగా పెత్తనం చెలాయించేవారే ఎక్కువ. ఇది బాగోలేదు అని మెత్తగా, ప్రేమగా చెప్పవలసినచోట కూడా 'నీకేం తెలీదు. నీ మొహం. తెలివితక్కువదానా' అని ఇట్లా అంటుంటే పైకి ఏమనలేకపోయినా లోలోపల ఆడవాళ్ళు ఎంతో కుమిలిపోతూ ఉంటారు. ఎంత వయసొచ్చినా గౌరవించకుండా మాట్లాడటం, గడ్డిపరకతో సమానంగా తీసేయటం గురించి ఎంతో మంది నొచ్చుకుంటూ మాట్లాడటం వింటుంటే చాలా బాధనిస్తుంది. మాటతో ఏమైన సాధించవచ్చు. కొంచెం ప్రేమగా, స్నేహంగా మాట్లాడితే దానివల్ల వచ్చే ఫలితం అమూల్యం. కఠినంగా, పెడసరంగా మాట్లాడితే దానికి మూల్యం చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త పాటించటం ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా అవసరమే!
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|