ఏలూరు : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న కారుకు స్వల్ప ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారుని తప్పించడానికి సడన్ బ్రేక్ వేయడంతో రెండు కార్లు డీ కొన్నాయి. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. చంద్రబాబు విజయవాడ నుండి ఏలూరు వెళుతుండగా తణుకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.