కరీంనగర్ : మహిళా హోంగార్డుపై లైంగిక వేధింపులకు పాల్పడిన రిజర్వు ఇన్ స్పెక్టర్ జేమ్స్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. జేమ్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్ ఐగా పని చేస్తున్నాడు. సోమవారం విధులకు వచ్చిన మహిళాగార్డుపై అత్యాచార యత్నం చేసాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆయన్ను చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు. ఎస్ ఐ తో పాటుగా ఉద్యోగినికి అసభ్యకర ఎస్ ఎం ఎస్ లు పంపుతున్న కానిస్టేబుల్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు.