రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లాలోని అంబాజీ పేట మండల పరిధిలోని మాచవరంలో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామంలోని పదిళ్లు ఈ అగ్ని ప్రమాదంలో ఆహుతయ్యాయి. మరో మహిళ కూడా సజీవ దహనమయింది. సుమారు 1.5 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు ప్రాధమిక అంచనా వేసారు.