'వీడొక్కడే' రివ్యూ
ముందుగా అనుకున్నట్టే స్టోరైలైన్ రొటీన్ వ్యవహారమే అయినా స్మగ్లింగ్ సంబంధిత క్రైమ్ ల విషయంలో తగిన రీసెర్చ్ చేసి, లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ రియలస్టిక్ ఎప్రోచ్ తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించడం కనిపిస్తుంది. ఆఫ్రికన్ లొకేషన్ల ఎంపిక యాప్ట్ గా ఉంది. డబ్బు దురశాతో యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోరాదనే సందేశం చిట్టి పాత్రలో కనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఇచ్చిన ముగింపు దయనీయంగా ఉన్నప్పటికీ నిప్పు ముట్టుకుంటే కాలక మానదనే హెచ్చరిక కూడా అందులో ఉంది.
సూర్య మరోసారి చక్కటి నటన ప్రదర్శించారు. ఒక పాటలో ఆయన వివిధ గెటప్ లలో కనిపించి కమల్ హాసన్ ను గుర్తు చేశారు. ఫైట్స్, డాన్స్ లు మెచ్చుకోలుగా ఉన్నాయి. రొమాంటిక్ యాంగిల్ లోనూ బాగా నప్పారు. తమన్నా తన పాత్రకు న్యాయం చేసింది. సూర్యతో తమన్నా జంట కన్నులపండువగా కూడా ఉంది. బిజినెస్ స్మిగ్లింగ్ అయినా అందులో కూడా కట్టుబాట్లు ఉండాలని నమ్మే వ్యక్తిగా
సీనియర్ నటుడు ప్రభు హుందాగా నటించారు. సినిమాలో చిట్టి పాత్ర బాగా గుర్తిండిపోతుంది. నటుడు జగన్ ఆ పాత్రను అత్యంత సహజంగా పోషించాడు. ఆ పాత్రపై తాను ఎంతో మోజుపడినట్టు సూర్య తన స్పెషల్ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. బాలీవుడ్ నటి కోయినా మిత్రా ఓ ఐటెంసాంగ్ లో నర్తించింది.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|