'వీడొక్కడే' రివ్యూ
సాంకేతికపరంగా ఎం.ఎస్.ప్రభు సినిమాటోగ్రఫీకి పూర్తి మార్కులు పడతాయి. ఫారెన్ లొకేషన్లలోనూ, సాంగ్స్ పిక్చరైజేషన్ లోనూ, ఫైటింగ్ సీక్వెన్స్ లలోనూ ఆయన కెమెరా కదం తొక్కిందనే చెప్పాలి. హారిస్ జైరాస్ సంగీతంలో గుర్తుంచుకోదగిన సాంగ్స్ లేకపోయినా సాహిత్యం (చంద్రబోస్ సింగిల్ కార్డ్ ) అర్ధమయ్యేలా కంపోజ్ చేయడం అభినందనీయం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫరవాలేదు. రాజశ్రీ సుధాకర్, కుమార్జీ సంభాషణలు తగినట్టుగానే ఉన్నాయి. 'త్రిష ఇష్టమా? అనుష్క ఇష్టమా?...అయ్యయ్యే మనకెప్పుడూ జోనే నండీ' (తమన్నాతో సూర్య - జో అంటే జ్యోతిక), 'స్నేహలా కనబడతావు...చేతలన్నీ ముమైత్ ఖాన్ వే' (తమన్నాను ఉద్దేశించి) వంటివి ప్రేక్షకులను నవ్విస్తాయి. రాజీవన్ కళాదర్శకత్వం, ఆంధోని ఎడిటింగ్ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించారు.
క్లాస్ కు సంబంధించిన అంశాలు అంతంత మాత్రమే అయినా, మాస్ ను మాత్రం 'వీడొక్కడే' నిశ్చయంగా ఆకట్టుకుంటాడు. ప్రథమార్థం క్రిస్ప్ గా ఉన్నా ద్వితీయార్థంలో నిడివి ఎక్కువనిపిస్తుంది. ఒక పాటను కుదించవచ్చు కూడా. ఓవరాల్ గా... కొన్ని మంచి యాక్షన్ ఎపిసోడ్లు, సాంకేతక విలువలు, సూర్య నటన కోసం తప్పనిసరిగా ఓసారి చూడొచ్చు.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|