'కిక్' రివ్యూ
రవితేజకు ఉన్న యాక్షన్ ఇమేజ్ కంటే ఎంటర్ టైన్ మెంట్ పండించడంలో ఆయనకున్న బలాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడంపైనే దర్శకుడు సురేందర్ రెడ్డి ఎక్కువగా దృష్టి సారించడం కనిపిస్తుంది. ఈ క్రమంలో కొన్ని లాజిక్ లు కూడా మిస్సయ్యారు. తాను పట్టుకోవాల్సిన దొంగ రవితేజ అని తెలిసిన తర్వాత కూడా పోలీస్ ఆఫీసర్ గా శ్యామ్ చేష్టలుడిగినట్టు చూస్తుండిపోతుంటాడు. రెడ్ హ్యాండెడ్ గా నే పట్టుకుంటానని సవాల్ విసరడం మినహా అతను చేసిందేమీ కనిపించదు. శ్యామ్ ను పక్కనే ఉంచుకుని...అందులోనూ వందలాది పోలీసుల కళ్లలో కారంకొట్టి అవలీలగా రవితేజ దొంగతనం చేసేస్తాడు. రవితేజ దొంగతనాల వెనుక ఓ సెంటిమెంట్ యాంగిల్ కూడా ఉంటుంది. ఇది కూడా లాజిక్ కు ఏమాత్రం నిలబడదు. డిసెంబర్ 16 లోగా తనను పట్టుకోమని రవితేజ చెప్పిన డెడ్ లైన్ కు చివర్లో ఓ ట్విస్ట్ (దర్శకుడి పరిభాషలో కిక్ ) ఇచ్చారు. ఇందులోనూ మాస్ కనికట్టు మినహా లాజిక్ తోచదు.
రవితేజ చురుకైన దొంగగా తన పాత్రలో పరకాయప్రవేశం చేశారు. బ్రహ్మానందంను ఆటపట్టించే సన్నివేశాలు బాగా పండాయి. ఒకరకంగా ఈ ఇద్దరి మధ్యా 'కృష్ణ' సినిమాలో నడిచిన కామెడీ ట్రాక్ కు ఇది కొనసాగింపుగా చెప్పుకోవచ్చు. రవితేజ మేకప్ విషయంలోనూ, హెయిర్ స్టయిలింగ్ పరంగానూ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కొట్చొచ్చినట్టు కనిపిస్తుంది. ఇలియానా ఇప్పుడు కొద్దిగా బరువు పెరిగి మరింత సెక్సీ లుక్ ను సంతరించుకోవడం విశేషం. నటనపరంగా ఫరవాలేదు. తమిళ నటుడు శ్యామ్ హ్యాండ్ సమ్ గా ఉండటంతో పాటు పోలీసు పాత్రలో చక్కగా ఇమిడిపోయారు. ఇండియాలో హల్వా రాజ్ గా, మలేసియా లో ప్రకాష్ రాజ్ గా బ్రహ్మానందం మరోసారి ప్రేక్షకులను హాయిగా నవ్వించారు. ఇలియానాపై మనసు పారేసుకోవడం, రవితేజతో పడిన తిప్పలు నవ్విస్తాయి. మెమరీ లాస్ పేషెంట్ అయిన ఆలీ డాక్టర్ వేషంలో ఆలీ, సబ్ ఇన్ స్పెక్టర్ గా జయప్రకాష్ రెడ్డి తగు మోతాదులో నవ్వించారు. చాలాకాలం తర్వాత సీనియర్ నటి ప్రభ ఇందులో కనిపించి ఇప్పటికీ గ్లమార్ గానే కనిపించడం అబ్బురపరుస్తుంది.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|