'కిక్' రివ్యూ
సాంకేతికపరంగా రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. థమన్ ఎస్ సంగీతం సమకూర్చిన బాణీల్లో 'ఐ డోంట్ వాంట్ లవ్', 'మనసే తడిసేలా' పాటలు హమ్మింగ్ కు బాగున్నాయి. అబ్బూరి రవి సంభాషణల్లో పంచ్ లు తక్కువే. 'నీలాటి కంచు నా లైఫ్ లోకి వస్తే అంతా కిక్కే', (ఇలియానాతో రవితేజ) 'ఐయామ్ రాజ్..ప్రకాష్ రాజ్..ఎప్పుడొస్తానో నాకే తెలియదు...ఐయామ్ గజనీ...ఏమైందో తెలియదు' (బ్రహ్మానందం...రవితేజ) వంటి సంభాషణలు ఆకట్టుకుంటాయి. నిర్మాత వెంకట్ క్వాలిటీ...బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడకపోవడం కనిపిస్తుంది.
సినిమాలో ప్రథమార్థం రవితేజ-ఇలియానా మధ్య రొమాంటింక్ సన్నివేశాలు, బ్రహ్మానందం కామెడీ ట్రాక్ తో అలరిస్తుంది. ద్వితీయార్థం కొద్దిపాటి నిడివి పెరిగినట్టు అనిపించక మానదు. చివర్లో మళ్లీ యాక్షన్ ఎపిసోడ్ తో దర్శకుడు కథను ట్రాక్ లోకి తెచ్చారు. పదేపదే 'కిక్' అనే మాట వాడటం వల్ల మొనాటనీకి అవకాశ మిచ్చినా టైటిల్ జస్టిఫికేషన్ కోసం దర్శకుడు పడిన తపనగా సరిపుచ్చకోవచ్చు. ఓవరాల్ గా...టైమ్ పాస్ 'కిక్' ఇది. రాబోయే వారాల్లో పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడం బాక్సాఫీస్ కు బలం చేకూర్చే అంశం కావచ్చు.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|