'ప్రయాణం' రివ్యూ
సాంకేతికపరంగా మలేసియా అందాలను సర్వేర్ మురారి మరింత అందంగా తెరకెక్కింకించారు. మహేష్ శంకర్ సంగీతం, బ్రాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా థీమ్ కు వెన్నుదన్నుగా నిలిచింది. ఇందులోని మూడు పాటలు సందర్భోచితంగానే వచ్చినా 'మేఘమా' పాట హైలైట్. కె.కె.రాధాకృష్ణ కుమార్ తో కలిసి చంద్రశేఖర్ యేలేటి అందించిన సంభాషణలు ఫరవాలేదు. 'మీ సూపర్ మెన్, బేట్ మెన్ లను మేము నమ్ముతాం...మా టైగర్ మెన్ ను మీరు నమ్మరా?' (ఎయిర్ పోర్ట్ అధికారులతో బ్రహ్మానందం), 'మీరో చిన్న నవ్వు నవ్వితే వీడు ఇంకొన్ని రోజులు బతుకుతాడేమోనండి' (హీరోయిన్ ఫ్రెండ్ తో హీరో), 'ఒక అబద్ధమాడి 100 సీరియల్స్ కు బలై పోతానని భయంగా ఉంది' (ఫ్రెండ్స్ తో హీరో), 'నేను రైతుని...మట్టిని, మనిషిని ఎప్పుడూ నమ్ముతాను' (హీరో టీమ్ తో బ్రహ్మానందం), 'అమ్మానాన్నలను ఇష్టపడని వాడు భార్యను కూడా ప్రేమించలేడు' (హీరోయిన్ క్వశ్చనీర్ పై హీరో) వంటి సంభాషణలు అలరిస్తాయి. చంద్రశేఖర్ యేలేటి నిర్మాణ విలువలు కూడా తగినట్టుగానే ఉన్నాయి.
కథలోని నావెల్టీ, దానిని యేలేటి తెరకెక్కించిన తీరు, మనోజ్ నటన, సంగీతం ఈ చిత్రానికి ఆకర్షణలుగా చెప్పాలి. లొకేషన్ల మార్పు లేకపోవడం, నేరేషన్ అక్కడక్కడా స్లో కావడం వంటివి మాస్ కు పట్టవు. క్లాస్ ఆడియెన్స్ ఫేవరెట్ అయిన యేలేటి ఈసారి యూత్ ను కూడా టార్గెట్ చేసుకుని 'ప్రయాణం' సాగించారు. ఓవరాల్ గా ఇదో డిఫరెంట్ తరహా చిత్రమని చెప్పొచ్చు. 'మల్టీప్లెక్స్' క్రౌడ్స్ అభిరుచులకు దగ్గరగా ఉంది.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|