'పిస్తా' రివ్యూ
సాంకేతికపరంగా వి.టి.విజయన్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. రాఖీ రాజేష్ ఫైట్స్ రొటీన్ విశాల్ ఫైట్స్ తరహాలోనే ఉండి అంతగా కొత్తదనం కనిపించదు. మణిశర్మ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్ రేంజ్ లోనే ఉంది. 'నా మహరాణి నువే' ట్యూన్, చిత్రీకరణ మాత్రం ఇంప్రెసివ్ గా ఉంది. శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు తగినట్టుగానే ఉన్నాయి. దినేష్ కొరియోగ్రఫీ టెక్నికల్ విభాగంలో హైలైట్ గా నిలుస్తుంది. చక్కటి స్టెప్స్ కంపోజ్ చేశారు. విశాల్ సొంత బ్యానర్ కావడంతో నిర్మాణ విలువల విషయంలో విక్రమ్ కృష్ణ ఎక్కడా రాజీ పడలేదు.
సినిమా ప్రథమార్థం టైమ్ పాస్ సన్నివేశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో అసలు కథ ఎస్టాబ్లిష్ కాదు. ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. క్లైమాక్స్ రొటీన్ పంథానే అనుసరించింది. శ్రియ గ్లామర్, ఆలీ కామెడీ, ఒకటి రెండు ఫైట్స్ సినిమాకి కొద్దిగానైనా కలిసొచ్చే అంశాలు. విశాల్ ఇకనైనా కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సన అవసరాన్ని 'పిస్తా' ప్రస్పుటం చేస్తుంది. ఈ తరహా చిత్రాలకు మాస్ ఆడియన్సే ప్రధాన పోషకులు కాబట్టి బి, సి సెంటర్ల ఆడియెన్స్ పైనే 'పిస్తా' భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|