'ఎవరైనా ఎపుడైనా' రివ్యూ
నిజానికి ఇలాంటి ఇతివృత్తాలు ప్రేక్షకులకు కొత్త కాదు. అయితే దర్శకుడు శంకర్ ఎక్కడా తొట్రుపాటు లేకుండా కథాగమనాన్ని సాగిస్తూ సమాంతరంగా కామెడీ ట్రాక్ ను నడిపారు. ఇదే క్రమంలో టైటిల్ చూసి రొమాంటిక్ ట్రీట్ ఆశించే వాళ్లకు ఆయన తగినంత డోస్ ఇవ్వలేదనే చెప్పాల్సి ఉంటుంది. కథ ఇంకో ఇరవై నిమిషాల్లో ముగుస్తుందనగా హీరోని చూసి హీరోయిన్ 'హగ్ మి' అని చేతులు చాపే ఘట్టం ఒక్కటే ఇందులో సరైన లవ్ ట్రీట్ గా చెప్పాలి. స్క్రీన్ పై హీరోహీరోయిన్లను తొలిసారి దగ్గర చేసిన వర్షం సాంగ్ ను అర్థాంతరంగా ముగించడం యువతరం ఆడియన్స్ నిస్సందేహంగా నిరాశపరుస్తుంది. ఆసుపత్రిలో రమాప్రభను ఆటపట్టించే సన్నివేశంలో వరుణ్ సందేష్ తలపై యమభటుడి తరహా కొమ్ములు మొలవడం, కాస్త అటూ ఇటూగా వరుణ్ సందేష్ దెబ్బలు తగిలినప్పుడు రమాప్రభ అతనిపై ప్రతీకారం తీర్చుకునే ఘట్టాన్ని దర్శకుడు బాగా హ్యాండిల్ చేశారు. ఏడుస్తున్న పాపను నిద్రపుచ్చేందుకు వరుణ్ చేసిన ట్రిక్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టింది.
వరుణ్ సందేష్ లో రెండు హిట్లు సాధించిన ఆత్మస్థైర్యం ఇప్పుడు మరింత తొణికిసలాడుతోంది. గత చిత్రాల్లో కేవలం లవర్ బాయ్ పాత్రలకే పరమితమైన వరుణ్ ఈ చిత్రంలో కామెడీ, యాక్షన్ అంశాలను కూడా సమర్ధవంతగా టచ్ చేసి మునుముందు విభిన్న పాత్రలు పోషించడానికి మార్గం సుగమం చేసుకున్నాడు. దేహదారుఢ్యాన్ని పెంచుకోక తప్పదు. విమలారామన్ లో చూపరులను ఇట్టే కట్టిపడేసే గ్లామర్ తొణికిసలాడింది. ఆమె నవ్వు, పెర్సనాలిటీ యూత్ ఆడియెన్స్ హృదయాలను దోచుకుంటుంది. నటనలోనూ రాణించింది. రమాప్రభను చాలాకాలం తర్వాత మళ్లీ మంచి కామెడీ పాత్రలో చూడటం అహ్లాదం కలిగిస్తుంది. మాటల్లేకుండా కేవలం హావభావాలతో ఆమె చక్కటి హాస్యం అందించింది. ఎప్పుడూ గొంతు చించుకునే తెలంగాణ శకుంతల తన మనువడికి భయపడే సాత్వికురాలిగా
నటించి మెప్పించింది. ఆలీ కామెడీ కూడా టైమ్లీగా ఉంది. వేణుమాధవ్ ఒకటి రెండు సన్నివేశాల్లో హడావిడి చేశారు. బ్రహ్మానందం క్లైమాక్స్ లో ఛమక్ మని మెరిశాడు. గిరిబాబు, రేష్మి, రాహుల్ , సురేఖా వాణి తదితర నటులు పాత్రోచితంగా నటించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|